కానిస్టేబుల్‌ను దారుణంగా చంపిన లిక్కర్‌ మాఫియా

రోజురోజుకూ క్రైమ్ లు ఎక్కువవుతున్నాయి.దేశంలో ఏదోఒక మూలన ఏదొక దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.

 Liquor Mafia Kills Police Constable,liquor Mafia,kills Police Constable,crime Ne-TeluguStop.com

దేశ భద్రత కోసం పనిచేస్తున్న పోలీసులపైనే దాడులకు తెగబడుతున్నారు.తాజాగా లిక్కర్ మాఫియా పోలీసులపైనే దాడులకు దిగారు.

ఈ అమానుష ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కస్‌గంజ్‌ జీల్లాలో చోటుచేసుకుంది.లిక్కర్ మాఫియా ఇక్కడ రెచ్చిపోయి వరసగా దాడులకు పాల్పడుతుంది.

కల్తీసారా తయారు చేస్తున్న లిక్కర్ మాఫియాపై పోలీసులు సోదాలు జరపడానికి వెళితే మాఫియాకు చెందిన గుండాలు పోలీసులపై దాడికి పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కస్‌గంజ్‌ జీల్లాలో లిక్కర్ మాఫియా చేసిన దాడులకు ఒక కానిస్టేబుల్ మృతి చెందారు.

ఎస్సై తీవ్రంగా గాయపడ్డారు.కస్‌గంజ్‌ జీల్లాలో తయారవుతున్న కల్తీ సారాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

కల్తీసారా ఫ్యాక్టరీలో అర్ధరాత్రి సోదా జరిపారు.సోదా జరపడానికి వెళ్లిన పోలీసులపై లిక్కర్ మాఫియాకు చెందిన రౌడీలు భౌతిక దాడులకు పాల్పడ్డారు.

Telugu Cm Yogi, Kasganj, Kills, Liquor Mafia, Uttar Pradesh-Latest News - Telugu

లిక్కర్ మాఫియాకు చెందిన రౌడీలు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించి చేతికి చిక్కిన వారిని బంధించి కర్రలు, ఆయుధాలతో దాడి చేసారు.ఒక కానిస్టేబుల్ ను నగ్నంగా చేసి హింసించారు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ మృతి చెందారు.తీవ్రంగా గాయపడ్డ ఎస్సై అశోక్‌కుమార్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అదనపు బలగాలతో అక్కడికి చేరుకున్నారు.తీవ్రంగా గాయపడ్డ పోలీసులను కాపాడి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

దాడి చేసిన లిక్కర్ మాఫియా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.ఈ ఘటనపై సి ఎం యోగి దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.ఎస్సై కి మెరుగయిన చికిత్స అందించాలని తెలిపారు.

చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి 50 లక్షలు పరిహారాన్ని ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube