సినిమా అనేది రంగుల ప్రపంచం.ఇక్కడ రాణించాలంటే నటనా ప్రతిభతో పాటు అందం, అభినయం కూడా మెండుగా ఉండాలి.
దీంతో ఈ మధ్య కాలంలో కొంత మంది నటీనటులు అందంగా కనిపించడం కోసం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇదే విధంగా తాజాగా ఓ హీరోయిన్ అందంగా కనిపించాలనే అత్యాశతో తన ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని చివరికి అది కాస్తా వికటించి అంద విహీనంగా కనిపించిన ఘటన చైనా దేశంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే గావో లియు అనే యంగ్ హీరోయిన్ చైనా దేశంలోని గ్వాంగ్జౌ పరిసర ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది.ఈ అమ్మడికి సినిమాల్లో నటించాలని చాలా ఆసక్తి ఉండేది.
దీంతో ఇదివరకే గావో లియు పలు లఘు చిత్రాలు మరియు చిన్న బడ్జెట్ తరహా చిత్రాల్లో కొంతమేర ప్రాధాన్యత ఉన్న పాత్రలలో కనిపించింది.అంతా సరిగ్గా సాగిపోతున్న సమయంలో అనుకోకుండా గావో లియు ముక్కు కి చిన్న దెబ్బ తగిలింది.
దీంతో దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించి గావో లియు తన ముక్కుకి సర్జరీ చేయించుకుంది.

అయితే ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత ముక్కు యధాస్థానానికి రాకపోగా సర్జరీ చేసిన భాగంలో మరింత నల్లగా మారిపోయింది. దీంతో గావో లియు లబోదిబోమంటూ తనకి సర్జరీ చేసిన వైద్యుల దగ్గరికి వెళ్ళి తన గోడును వెళ్లబోసుకున్నా ఫలితం లేకపోయింది.దీంతో సర్జరీ తర్వాత అందంగా కనిపించడమనే మాట అటుంచితే ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమా అవకాశాలు అసలు రావడం లేదు.
దీంతో ఈ విషయాన్ని గావో లియు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిపింది. అంతేకాకుండా అందంగా కనిపించడం కోసం అవగాహన లేకుండా ప్లాస్టిక్ సర్జరీలు మరియు ఇతర కెమికల్ ఉత్పత్తులను వాడద్దని సూచించింది.
దీంతో కొందరు నెటిజన్లు గావో లియు కి తమ మద్దతును తెలుపుతూ ధైర్యం చెబుతున్నారు.అంతేగాక ఒక్కోసారి మన జీవితంలోఅనుకోకుండా చోటు చేసుకున్న సంఘటనలు ఒక్కోసారి మొత్తం జీవితాన్ని మలుపు తిప్పుతాయని, అయినప్పటికీ నిరాశ చెందకుండా ముందుకు సాగుతుంటే కచ్చితంగా విజయం సాధిస్తామని కాబట్టి సహనం కోల్పోకుండా ధైర్యంగా ఉండమని సూచిస్తున్నారు.