ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ప్రసాద్ స్టూడియో నుంచి ఖాళీ చేసిన తర్వాత చెన్నై లోని టీనగర్ లో ఎంఎం థియేటర్ కొని దాన్ని తన సొంత రికార్డింగ్ థియేటర్ గా తీర్చిదిద్దారు.ఆయన తన ఓన్ రికార్డింగ్ థియేటర్ ద్వారా తొలిసారిగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ బుధవారం రోజు తన స్టూడియో ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన కొన్ని శాపనార్థాలు పెట్టారు.విజయ వాహినీ స్టూడియో ఆసియా ఖండంలోనే అతిపెద్దది అని కానీ అది ఇప్పుడు కనుమరుగయ్యిందని.
అలాగే జెమిని, శారదా, విజయ్ గార్డెన్ ఇలా చెప్పుకుంటూ పోతే చెన్నైలో ఉన్న పెద్ద స్టూడియోలన్నీ కనుమరుగయ్యాయని.ప్రసాద్ స్టూడియో కూడా అదే తరహాలో కనుమరుగు కావాలనే తాను ఆ స్టూడియో నుంచి బయటకు వచ్చానని సంచలన వ్యాఖ్యలు చేశారు.అసలు ఇళయరాజా ప్రసాద్ స్టూడియో పై ఇలా శాపనార్థాలు పెట్టడానికి గల కారణం ఏమిటో ఈ ఆర్టికల్ వివరంగా తెలుసుకుందాం.
1970 కాలంలో ఎల్.వి.ప్రసాద్ బతికున్న రోజుల్లో ఆయన తన స్టూడియోలోని ఒక రూమ్ ని మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు చూపించి.దీన్ని మీ రికార్డింగ్ థియేటర్ గా వాడుకోండని బంపర్ ఆఫర్ ఇచ్చారు.దీంతో ఎంతో సంతోషించిన ఇళయరాజా.ప్రసాద్ ఇచ్చిన గదిని తన రికార్డింగ్ థియేటర్ గా మార్చుకున్నారు.తర్వాత ఆయన ఎన్నో సినిమాలకు సంగీతం సమకూరుస్తూ ఎంతో బిజీగా ఉండేవారు.
ప్రసాద్ స్టూడియోలో ఉన్నప్పుడే ఇళయరాజా 1000 సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు.అప్పటి కాలంలో ప్రసాద్ స్టూడియో కూడా సినిమాల షూటింగ్స్ తో కళకళలాడేది.
ప్రసాద్ స్టూడియో బ్యానర్ పై తెరకెక్కిన కొన్ని సినిమాలకు ఇళయరాజా సంగీతం కూడా సమకూర్చారు.అప్పట్లో ఎల్.
వి.ప్రసాద్, ఇళయరాజా మధ్య మంచి సత్సంబంధాలు ఉండేవి.

అయితే దశాబ్దాల తర్వాత స్టూడియో తో పాటు ఇళయరాజా కూడా పాత పడ్డారు.ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగమే అన్ని రంగాల్లో కెల్లా నెంబర్ వన్ గా నిలుస్తోంది.చెన్నై మహానగరంలో రికార్డింగ్ స్టూడియో లు మొత్తం మూలాన పడ్డాయి.దీంతో ప్రసాద్ కుమారులు తమ స్టూడియో ని ఒక ఐటి కంపెనీ కి లీజుకు ఇవ్వాలనుకున్నారు.
కానీ ఇళయరాజా మాత్రం అందుకు ఒప్పుకోలేదు.ప్రసాద్ స్టూడియోలో ఉన్న రికార్డింగ్ థియేటర్ తో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని.
తాను ఖాళీ చేయమని తేల్చి చెప్పారు.దీంతో మా సొంత స్టూడియో నుంచి వెళ్లిపోవడానికి నీకేం ఇబ్బంది అన్నట్టు ప్రసాద్ తనయులు ఇళయరాజా ని నిలదీశారు.
అలాగే ఇళయరాజా రికార్డింగ్ థియేటర్ కి తాళం వేసి ఆయనను స్టూడియో నుంచి వెళ్లగొట్టారు.దీంతో షార్ట్ టెంపర్ ఉన్న ఇళయరాజా తెగ బాధపడి పోయి తనని ప్రసాద్ తనయులు స్టూడియో గేటు కూడా తొక్కనివ్వడంలేదని కోర్టును ఆశ్రయించారు.అలాగే తనను మానసిక క్షోభ కు గురి చేసినందుకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టులో కేసు వేశారు.
అయితే ఇళయరాజా వేసిన పిటిషన్ పై వాదోపవాదనలు విన్న కోర్టు.ఏదో ఫ్రీగా ప్రసాద్ స్టూడియో వాళ్ళు మీకు గది ఇస్తే.దశాబ్దాల తరబడి ఫ్రీగా వాడుకొని ఇప్పుడు ఖాళీ చెయ్యమంటే చేయకుండా.ఈ వాదనలు ఏంటి? నష్టపరిహారం ఏంటి? అని బాగా ఆగ్రహించి మీకు ఒక పూట టైం ఇస్తున్నాం.మీ సామాన్లన్నీ తెచ్చుకోండి అని తీర్పు ఇచ్చింది.అయితే సామాన్లు తీసుకుపోవడానికి ఇళయరాజాకు ప్రసాద్ కుమారులు కూడా అనుమతి ఇచ్చారు.కానీ అప్పటికే ఇళయరాజా రికార్డింగ్ థియేటర్ గది లో ఉన్న సామాన్లన్నీ కూడా గోదాము లో పడేశారు.పద్మ విభూషణ్ అవార్డుతో పాటు తబలా, ఓ వీణ, ఓ హార్మోనియం పెట్టెను కూడా గోదాము లో పడేసారని తెలుసుకున్న ఇళయరాజా స్టూడియో కి వెళ్ళకుండా తన అసిస్టెంట్లతో తనకు సంబంధించిన అన్ని సంగీత పరికరాలను డిసెంబర్ 29న తెచ్చుకున్నారు.

నిజానికి ఇళయరాజా తనది కాని ఒక చిన్న గది కోసం కోర్టును ఆశ్రయించి.నానా రభస సృష్టించి చివరకు న్యాయస్థానంలో మొట్టికాయలు వేయించుకుని ప్రజల్లో పరువుపోగొట్టుకున్నారు.తన చిన్న గది కోసం మొత్తం స్టూడియోని ఖాళీగా ఉంచరని తెలిసి కూడా ఇళయరాజా ప్రసాద్ కొడుకులతో అనవసరంగా గొడవ పెట్టుకున్నారు.ఒక్క నెలలోనే సొంత థియేటర్ ని ఓపెన్ చేయడం సాధ్యం కాదు.
దీన్నిబట్టి ప్రసాద్ స్టూడియో నుంచి బయటకు రాకముందే ఇళయరాజా సొంత స్టూడియో ని ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారని తెలిసింది.మరి అలాంటప్పుడు ప్రసాద్ స్టూడియో లోని ఓ చిన్న గది తో అనుబంధాలు ఉన్నాయని, ఖాళీ చేయడం కుదరదని అనవసరంగా కొర్రిలు పెట్టడం ఎందుకు? అందరి ముందు ఓడిపోయి ఇండస్ట్రీలో పరువు పోగొట్టుకోవడం ఎందుకు? అని ఇళయరాజా తీరుపై ప్రస్తుతం చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.