దేవుడా: గోల్డ్ స్మగ్లింగ్ ఈ విధంగా కూడా చేస్తున్నారా..!?

ప్రపంచంలో అన్ని దేశాల కంటే దుబాయ్ లో బంగారం చాలా తక్కువ ధరకు లభిస్తుంది.అక్కడి నుంచి చాలామంది బంగారం కొనుగోలు చేసుకొని వివిధ దేశాలకు తీసుకువెళుతూ ఉంటారు.

 Gold Smuggling, Airport, Carbon, Chocolates , Gold Smuggling In Airport, Gold I-TeluguStop.com

అయితే దుబాయ్ నుండి వివిధ దేశాలకు వెళ్లేవారు కొద్ది మొత్తంలో తీసుకుపోయే బంగారానికి ఏ అధికారులు అడ్డు చెప్పరు.ఒకవేళ ఏ దేశమైనా సరే వారు నిర్ణయించిన బంగారం కంటే ఎక్కువగా బంగారం ఓ వ్యక్తి దుబాయి దేశం నుంచి తీసుకువస్తే అందుకు సంబంధించి లెక్కలు చూపించాల్సి ఉంటుంది.

లేకపోతే ఆ బంగారానికి సంబంధించి ట్యాక్స్ వారి ప్రభుత్వాలకి కట్టాల్సి ఉంటుంది.ఇకపోతే భారతదేశంలో బంగారం ధరకి దుబాయ్ లో 10 గ్రాముల బంగారం ధరకి దాదాపు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు వ్యత్యాసం ఉంటుంది.

ఇంత వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో చాలా మంది దుబాయ్ కి వెళ్లి వచ్చిన వారు ఎందరో బంగారాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు.ఇలా తక్కువ ధరకు ఆ దేశంలో బంగారాన్ని కొని దానిని భారతదేశంలోని అధికారుల కళ్లు కప్పి తీసుకురావడానికి అనేకమంది ప్రయత్నాలు చేస్తుంటారు.

ఇదిలా ఉండగా.ఎయిర్ పోర్ట్ అధికారులు కూడా వారి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి స్మగ్లర్లు ఎంతటి ఉపాయాలు చేసిన వారిని పట్టుకుంటారు.తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.ముంబై నగరంలో ఉన్న ఎయిర్ పోర్ట్ లో దుబాయ్ నుంచి వస్తున్న ఈకే – 500 విమానం బొంబాయి ఎయిర్ పోర్ట్ లో నుండి దిగిన తర్వాత.

ఓ వ్యక్తి ఇండియాలో కరోనా మళ్ళీ పెరుగుతుందా లేదా అంటూ ముందుకు వెళ్లసాగాడు.అలా బయటికి వెళ్తున్న సమయంలో ఆ వ్యక్తి వద్ద ఉన్న బ్యాగును స్కానింగ్ యంత్రాలు స్కాన్ చేయగా అక్కడ వారికి విషయం అర్థం కాలేదు.

దాంతో ఆ వ్యక్తి పై అనుమానం వచ్చి బ్యాగ్ లో ఏముంది అని అడగగా చాక్లెట్స్ అని కట్టుకథ చెప్పాడు.

Telugu Airport, Carbon, Chocolates, Gold-Latest News - Telugu

ఆయన కానీ అధికారులు ఏ కంపెనీ చాక్లెట్స్ అని అడిగి వాటి వివరాలను తెలుసుకుందామని వాటిని ఓ గదిలోకి తీసుకువెళ్లి బయటికి తీశారు.అయితే ఆ చాక్లెట్ బాక్స్ లో అచ్చం చూడడానికి కేవలం పుల్ల చాక్లెట్స్ మాత్రమే కనబడ్డాయి.అయితే అధికారులు చేసిన స్కానింగ్ లో కార్బన్ కోటింగ్ లాంటి పదార్థాలు కనపడ్డాయి.

దీంతో అధికారులకు అనుమానం వచ్చి చాక్లెట్ ప్యాకెట్ లను ఓపెన్ చేసి క్షుణ్నంగా పరిశీలించారు.అలా పరిశీలించడంతో ప్రతి ప్యాకెట్ పెట్టెలో బంగారాన్ని ఓ సన్నని పొర ఏర్పాటుచేసి దానిపైన కార్బన్ కోటింగ్ వేసి దానిని చాక్లెట్ బాక్స్ గా తీర్చిదిద్దారు.

ఇలా ఆ వ్యక్తి వద్ద ఏకంగా 481 గ్రాముల 24 క్యారెట్ల బంగారం బయటపడింది.ప్రస్తుతం అతనిపై అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube