రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధర రూ. 50..!? ఏది నిజం..?

ప్రస్తుతం ఉన్న సమాజంలో టెక్నాలజీ పరంగా ఎదుగుదల ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ టెక్నాలజీని కొందరు మంచికి ఉపయోగిస్తే, మరికొందరయితే దాన్ని చెడుకు ఉపయోగించే ప్రయత్నంలో ఉన్నారు.

ఇక ఇటీవల కాలంలో ఎక్కువగా సైబర్ నేరగాళ్ల నుంచి మోసపోయిన కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లను స్పీడ్ చేయడమే వారి పనిగా పెట్టుకున్నారు.

వీటితోపాటు కొన్ని వార్తలని టార్గెట్ పెట్టుకొని ఫేక్ వార్తలను తయారు చేయడం, వాటిని వైరల్ గా మార్చడమే వారి ముఖ్య లక్ష్యం.అలాంటి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

అదేమిటంటే.ఇటీవల కాలంలో రైల్వే టికెట్ పై ఆదానీ రైల్వే అని పేరు ఉండడం.ఫ్లాట్ ఫామ్ టికెట్ ధర రూ.50 ఉన్న చిత్రం ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.కేంద్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ ప్రైవేట్ చేస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో ఆ ఫ్లాట్ ఫామ్ టికెట్ ఫోటో చక్కర్లు కొడుతుంది.

Advertisement

అంతేకాకుండా ఈ ఫోటో పై తీవ్రస్థాయిలో చర్చ కొనసాగుతుంది.మరికొందరైతే రైల్వేను ఆదానీ సంస్థకు అమ్మేస్తే ఫ్లాట్ ఫామ్ టికెట్ ధర పెరగడంలో ఎటువంటి సందేహం లేదని వారి భావన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయాన్ని పరిశీలన చేస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటో అంతా ఫేక్ అని తెలుస్తుంది.

ఆ ఫోటో పూణే జంక్షన్ పేరు, ఈ సంవత్సరం ఆగస్టులోనూ ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.కరోనా వ్యాప్తికి కారణంగా ఆ సమయంలో ఫ్లాట్ ఫామ్ టికెట్ ధరను 35 నుంచి 50 రూపాయలకు పెంచిన సంగతి అందరికీ విదితమే.అప్పట్లో ఫ్లాట్ ఫామ్ టికెట్ ధర పెంచడం పై అనేక చర్చలు కూడా కొనసాగాయి.

ప్రస్తుతం అదే టికెట్ పై ఆదానీ రైల్వే అని ఎడిట్ చేసి ఫోటోలు వైరల్ గా మారుస్తున్నారు.ఈ మధ్యకాలంలో ఒక రైల్వే భోగి పైన కూడా ఆదానీ పేరు ఉన్నట్లు చిత్రీకరణ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇదిలా ఉండగా మరోవైపు ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు