తమిళ సూపర్ స్టార్ విజయ్ మరియు ఆయన తండ్రి చంద్ర శేఖర్‌ల మద్య వివాదం కొనసాగుతుంది.విజయ్ ను హీరోగా తీసుకు వచ్చింది చంద్రశేఖర్ అనే విషయం తెల్సిందే.
విజయ్ హీరోగా ఫామ్‌లోకి వచ్చిన తర్వాత ఆయన పేరు మీద అభిమాన సంఘం ఏర్పాటు చేసి స్వచ్చంద సంస్థగా మార్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు వస్తున్నాడు.దాదాపు పాతిక సంవత్సరాలుగా చంద్రశేఖర్ స్వచ్చంద సంస్థ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
విజయ్ పేరుతోనే చేస్తున్నా కూడా అవి పూర్తిగా చంద్రశేఖర్ ఆదేశాలు సూచనల మేరకు జరుగుతున్నాయి.కొడుకు విజయ్ పై ఉన్న ప్రేమతో చంద్రశేఖర్ ఆ పని చేస్తున్నాడు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఆ అభిమాన సంఘంను ఇప్పుడు చంద్రశేఖర్ రాజకీయ పార్టీగా మార్చాడు.ఆ విషయం ఫై విజయ్‌కి ఎట్టి పరిస్థితుల్లో ఆసక్తి లేదు.
ఆ విషయమై తండ్రి కొడుకుల మద్య వివాదం జరుగుతోంది.
చంద్రశేఖర్ పెట్టిన రాజకీయ పార్టీకి తనకు ఎలాంటి సంభందం లేదు అన్నాడు.
నా అభిమానులు ఎవరు కూడా ఆ పార్టీలో జాయిన్ అవ్వొద్దు అంటూ ఇప్పటికే సూచించాడు.ఇక తన అభిమాన సంఘం జెండా కాని నా ఫొటో కాని ఎక్కడైనా ఆ పార్టీ కోసం వాడితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాను అంటూ తండ్రి అని కూడా చూడకుండా విజయ్ హెచ్చరించాడు.
ఈ నేపథ్యంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశాడు.విజయ్ పై తనకు ఉన్న ప్రేమను తెలియజేస్తూ అతడితో ఎవరో ఇలా మాట్లాడిస్తున్నారు అన్నాడు.
విజయ్ మాత్రం మీ ప్రేమ నాకేం వద్దు బాబోయ్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. విజయ్ తల్లి కూడా భర్త పెట్టిన పార్టీలో సభ్యురాలిగా జాయిన్ అయ్యేందుకు ఆసక్తిగా లేను అంటూ క్లారిటీ ఇచ్చింది.
విజయ్ రాజకీయాలపై ప్రస్తుతం ఆసక్తి లేదు అన్నట్లుగా ఉంటున్నాడు.ఆయన రాజకీయాల్లోకి రావాలనేది ఆయన తండ్రి చంద్రశేఖర్ కోరిక.