డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె తోపాటు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ ఇంకా పలువురి పేర్లు బయటకు వచ్చాయి.సుశాంత్ మృతి కేసు విచారిస్తున్న సమయంలో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది.
డ్రగ్స్ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తిని ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు.అరెస్ట్ అయిన వారిని విచారిస్తున్న సందర్భంగా కొత్తగా వీరి పేర్లు బయటకు వచ్చాయి అంటూ అంతా భావించారు.
కానీ రియా చక్రవర్తి తరపు లాయర్ మాత్రం ఇప్పటి వరకు రియా చక్రవర్తి ఎవరి పేర్లు చెప్పలేదని అంటున్నాడు.
ఆమె ను విచారించిన సందర్భంగా బాలీవుడ్ కు చెందిన ఎవరి పేర్లను కూడా ఆమె చెప్పనట్లు గా ఆయన నమ్మకంగా చెబుతున్నాడు.
మరి వారి పేర్లు రియా చెప్పకుంటే ఎవరు చెప్పారు అంటూ ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది.రియా అరెస్టుకు ముందు డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్న కొందరిని ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేయడం జరిగింది.
వారిలో ఎవరైనా దీపికా పదుకొనె తోపాటు రకుల్ ప్రీత్ సింగ్ ల పేర్లు చెప్పి ఉంటారేమో అంటూ కొందరు అనుమానిస్తున్నారు.ఏది ఏమైనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల పేర్లు ఇలాంటి కేసుల్లో బయటకు రావడంతో అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసులో ప్రస్తుత పరిణామాలు కేవలం ఆరంభం మాత్రమే అంటున్నా అధికారులు ముందు ముందు మరింత మందికి సమన్లు జారీ చేస్తామంటున్నారట.

బాలీవుడ్ వర్గాల వారితో పాటు ఇతర సినీ వర్గాల వారు కూడా ఈ విషయమై ఆందోళనగా ఎదురు చూస్తున్నారు.బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్నట్లుగా ఇప్పటికే జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఎన్‌సీబీ అధికారులు అసలు ఎవరిని ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరి ద్వారా ఈ పేర్లు రాబడుతున్నారు అనేది అందరి లో చర్చనీయాంశంగా మారింది.
వచ్చే వారంలో మరికొంత మంది ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ముందు ముందు మరెంత మంది విచారణ ఎదుర్కొంటారో చూడాలి.