సుశాంత్ మరణం తర్వాత దేశ వ్యాప్తంగా నెపోటిజం గురించి పెద్ద చర్చ నడుస్తుంది.అన్ని రంగాలలో కూడా వారసత్వం అనేది ఉంటుందని.
ఒక రంగంలో సక్సెస్ అయిన వారి పిల్లలు కూడా అదే రంగంలో వెళ్లాలని అనుకోవడంలో తప్పులేదని చాలా మంది వాదిస్తున్నారు.అయితే ఈ వారసత్వం కారణంగా టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు రావడం లేదని, వచ్చిన ఎదగడం లేదని విమర్శించే వాళ్ళు ఉన్నారు.
ఏది ఏమైనా ఇప్పుడు దేశ వ్యాప్తంగా నెపోటిజం అనే కాన్సెప్ట్ బాగా పాపులర్ అయ్యింది.అయితే ఇది క్రీడలలో కూడా ఉంటుందా అంటే ఆ అవకాశం ఉండదని చాలా మంది క్రీడాకారులు చెబుతున్నారు.
ఒక స్థాయి వరకు నెపోటిజం ఉన్న కూడా అంతకుమించి పైకి ఎదగాలంటే మాత్రం కచ్చితంగా టాలెంట్ ఉండాలని, అది ఉంటేనే క్రీడలలో సక్సెస్ అనేది వస్తుందని చెబుతున్నారు.
ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లో నెపోటిజం అంతగా పనిచేయదని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా అంటున్నారు.
ఇటీవల ఓ అభిమాని నెపోటిజంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.ఇతర రంగాల విషయం పక్కన పెడితే క్రికెట్‌లో నెపోటిజం అంతగా ప్రభావం చూపదని, దీనికి ఎన్నో ఆధారాలున్నాయని ఆయన అన్నారు.
క్రికెట్‌లో ప్రతిభకే ఎక్కువ విలువుంటుంది.బంధుప్రీతి అంతగా పనిచేయదు.
ఒకవేళ అదే ఉపయోగపడితే సునీల్ గవాస్కర్ తనయుడు రోహన్ గవాస్కర్ జట్టులో సుస్థిర స్ఘానం సంపాదించుకోగలిగేవాడు.సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసేవాడు అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చారు.
ఆకాష్ చోప్రా చెప్పిన మాటలతో చాలా మంది ఏకీభవిస్తున్నారు.