మామూలుగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దారివెంట పాములు కనపడ్డాయి అంటే ఒక్కసారిగా గుండెలు జారిపోతాయి.ఇక పాములు మనకు దగ్గరగా ఉంటే అక్కడి నుంచి పరుగో పరుగు.
ఇలాంటి పాములు మనం రోజూ ఉంటున్న ఇంట్లోనే ఉంటే… అబ్బో ఇలా చెబుతుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదా.కానీ తాజాగా ఒక కుటుంబానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.
భువనేశ్వర్ రాష్ట్రంలోని భద్రక్ జిల్లాలో విజయ్ బిశ్వాక్ అనే వ్యక్తి ఇంట్లో నాగు పాముల గుట్ట బయటపడడం సంచలనంగా మారింది.సదరు వ్యక్తి ఇంట్లో గత వారం రోజుల నుంచి నాగు పాములు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించాయి.
ముందుగా అంతగా పట్టించుకోలేదు.కానీ ఆ తర్వాత సందేహం వచ్చి… వెంటనే స్నేక్ హెల్ప్ అధికారులకు సమాచారం అందించారు కుటుంబ సభ్యులు.
దీంతో హుటాహుటీన అక్కడికి చేరుకున్న స్నేక్ హెల్ప్ అధికారులు.ఆ ఇంట్లో దాగిఉన్న నాగు పాముల గుట్టని బయటకు తీశారు.
ఆరు గంటలపాటు శ్రమించి 43 నాగుపాము పిల్లలతో పాటు ఒక తల్లి నాగుపామును కూడా పట్టుకున్నారు.అంతేకాదు మరో 58 పాము గుడ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం ఇలా గుట్టలుగుట్టలుగా పాములు బయటపడటం స్థానికంగా సంచలనంగా మారిపోయింది.అయితే అక్కడ మరిన్ని పెద్ద పాములు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.