టాలీవుడ్‌లో షూటింగ్స్‌కు అనుమతులు వచ్చినా కూడా గతంలో మాదిరిగా సందడి అయితే లేదు.సీరియల్స్ మరియు బుల్లి తెరకు చెందిన కొన్ని రియాల్టీ షోలు ఇంకా కొన్ని వెబ్ సిరీస్‌లు చిన్న చిన్న సినిమాలు మాత్రమే చిత్రీకరణ జరుగుతున్నాయి.
పెద్ద సినిమాలు పెద్దగా షూటింగ్ జరపడం లేదు.ముఖ్యంగా పెద్ద నిర్మాతలు అయిన సురేష్‌బాబు దిల్‌రాజులు ఇప్పటికే తాము ఈ ఏడాది కొత్త సినిమాలను ప్రారంభించం, ఇప్పటికే ప్రారంభంలో ఉన్నవి కూడా పూర్తి చేసే ఉద్దేశ్యంలో లేమంటూ సురేష్‌బాబు ప్రకటించాడు.
సురేష్‌బాబు ఏమాత్రం ఛాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.ఖచ్చితంగా సురేష్‌బాబు ఈ ఏడాది వరకు కొత్త సినిమాలను ప్రారంభం చేసే అవకాశం లేదు.
కనుక ఇతర సినిమాల నిర్మాతలు కూడా తమ సినిమాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపడం లేదు.దిల్‌రాజు తన పూర్తి కావచ్చిన వకీల్ సాబ్‌ను మాత్రమే పూర్తి చేస్తాడట.
ఆ తర్వాత కొత్త సినిమాలు చేయడని అంటున్నారు.
ఇక ప్రభాస్ 20వ చిత్రంను ఆ తర్వాత ఆచార్య చిత్రాన్ని ఇంకా కొన్ని పెద్ద సినిమాలను కూడా ఈ ఏడాదిలో అసలు ప్రారంభించేందుకు సిద్దంగా లేరు.
ఈ విషయంలో స్టార్ నిర్మాతలందరికి ఒకే దారి అన్నట్లుగా తెలుస్తోంది.చిన్నా చితకా సినిమాలు మాత్రమే షూటింగ్ జరుపుకుని ఈ ఏడాది విడుదల అవుతాయని అంటున్నారు.
వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు సినిమాలు రాకపోవచ్చు.