టాలీవుడ్‌లో తెరకెక్కనున్న ప్రెస్టీజియస్ మూవీల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ ఖచ్చితంగా టాప్ స్థానంలో ఉంటుంది.ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులపై కన్నేశాడు మహేష్.
ఇక ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాతో మహేష్ మరోసారి బలమైన సోషల్ మెసేజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమాలో ఆర్థిక నేరాల బ్యాక్‌డ్రాప్ ఉండటంతో మహేష్ నోటివెంట పవర్ ఫుల్ డైలాగులు రానున్నాయని తెలుస్తోంది.గతకొంత కాలంగా మహేష్ తెరకెక్కిస్తున్న చిత్రాల్లో సోషల్ మెసేజ్‌లు ఎక్కువగానే ఉంటున్నాయి.
వాటిని మరింత పవర్‌ఫుల్‌గా మహేష్ చెప్పే డైలాగులతో ప్రేక్షకులను ఆలోచింపజేసేందుకు చిత్ర దర్శకులు ప్లాన్ చేస్తారు.ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి పవర్‌ఫుల్ డైలాగులను పరశురామ్ మహేష్ చేత చెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.
ముఖ్యంగా మోదీ ప్రభుత్వాన్ని ఈ సినిమాలో ఓ రేంజ్‌లో ఏసుకునేందుకు చిత్ర దర్శకుడు రెడీ అవుతున్నాడు.దీంతో ఈ సినిమా డైలాగులపై చిత్ర యూనిట్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా మోడ్రన్ లుక్‌లో మనకు కనిపిస్తుండగా, ఆయన సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారా అనే సందేహం సర్వత్రా మొదలైంది.మొత్తానికి ఈ సినిమాతో పొలిటికల్ పంచ్‌లు వేసేందుకు మహేష్ రెడీ అవుతుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.