కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న విషయం విదితమే.ఈ కరోనా మహమ్మారికి దేశాలు అన్ని కూడా లాక్ డౌన్ లు విధించడం తో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమైపోయారు.
ఒక విందు,వినోదం వంటివి ఏమీ లేకుండా సైలెంట్ గా ఇంటిలోనే కూర్చుంటున్నారు.అయితే ఇటీవల అగ్రరాజ్యం అమెరికా లో లాక్ డౌన్ ను ఎత్తివేసి కొన్ని ఆంక్షలను మాత్రమే విధించడం తో దాదాపు అన్ని కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలోనే ఇన్ని రోజులు సైలెంట్ గా ఇంటిలోనే ఉన్న వారు ఇప్పుడు ఇక రెస్టారెంట్లు, హోటల్స్ తీసి ఉంచడం తో కొంచం బయటకు వెళ్ళాలి అనుకున్న వారు ఆగకుండా వాటిని ఉపయోగించుకుంటున్నారు.
అయితే ఈ కరోనా అనేది పూర్తిగా అంతం కానీ నేపథ్యంలో ఇప్పటికీ కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి వచ్చింది.
అందుకే అమెరికా లోని మేరీ లాండ్ ఓషన్ సిటీలోని ఒక రెస్టారెంట్ భౌతిక దూరం పాటించడం కోసం వినూత్నంగా ఆలోచించి ఒక పద్దతికి శ్రీకారం చుట్టింది.తమ రెస్టారెంట్‌కు వచ్చే వారికి ట్యూబ్స్ తొడిగి వైరస్ భయం లేకుండా లోపలి పంపుతున్నారు.
పెద్ద పెద్ద ట్యూబ్స్ వాడడం వల్ల జనాల మధ్య భౌతిక దూరం పక్కాగా ఉంటుందని వారు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ఫిష్ టేల్స్ రెస్టారెంట్ ఇన్‌ఫ్లాటబుల్ ట్యూబులు అందుబాటులోకి తెచ్చింది.
రెస్టారెంట్‌కు వెళ్లి ఏదైనా తినాలనుకునే వారు ముందుగా ఆ ట్యూబులో దూరాలి.
ఆ తర్వాత దాన్ని నెట్టుకుంటూ లోపలికి వెళ్లి కావాల్సిన ఫుడ్ ని ఆర్డర్ చేసుకోవాలట.
అయితే ఆ ట్యూబ్ లో కూర్చోవడానికి ఆస్కారం ఉండదు.అందుకే దానిలోకి దూరి అలానే నిలబడి దానిపై ఫుడ్ పెట్టుకొని తినేయడమే.
బంపర్ టేబుల్స్ పేరుతో ఈ విధంగా ఆ రెస్టారెంట్ ఆహారం అందిస్తోంది.ఒకేసారి 50 మంది తినేలా ట్యూబ్స్ అందుబాటులో ఉంచారు.
వారి పరిమాణంతో ఆరు అడుగుల దూరం పక్కాగా పాటిస్తుండటం విశేషం.కరోనా వచ్చి ప్రపంచానికి కొత్త కొత్త అలవాట్లను నేర్పింది.
ప్రజలు గంపులు గంపులుగా ఉండకుండా కావాల్సిన దూరం పాటిస్తున్న సంగతి తెలిసిందే.