ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మారుతీ రావు ఆత్మహత్య విషయం బాగానే కలకలం రేపుతోంది.ఈ విషయంపై ఇప్పటికే పలువురు ప్రజా సంఘాల నాయకులు మరియు సోషలిస్ట్ నాయకులు బాగానే స్పందిస్తున్నారు.
అయితే తాజాగా ఈ విషయంపై నచ్చావులే సినిమా హీరోయిన్ మరియు బిజెపి మహిళా నేత మాధవిలత కూడా స్పందించారు.ఇందులో భాగంగా అమృత పై పలు రకాల ఆసక్తి వ్యాఖ్యలు చేశారు.
అంతేగాక తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా అమృత ఈస్ ఎన్ వారియర్ అంటూ పోస్ట్ చేశారు.
అయితే ఈ పోస్టు ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతుంది.
కొంతమంది అయితే మాధవిలత పోస్ట్ తో ఏకీభవిస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇందులో భాగంగా ఓ నెటిజన్ త్యుత్సాహం ప్రదర్శిస్తూ నీకు కూడా అమృతం లాంటి ఆడబిడ్డ పుట్టాలని అంటూ కామెంట్ చేశాడు.
దీనికి మాధవి లత కూడా తనదైన శైలిలో స్పందిస్తూ నేను కూడా నాకు అమృత లాంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటానని కానీ అమృత తండ్రి మారుతీ రావు లాగా ఆమెను పెంచనంటూ రిప్లై ఇచ్చింది.అంతేకాక అమృత అతి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని చాలా కష్టాలు అనుభవించిందని, మరోపక్క తండ్రికి అన్యాయం చేసిందంటూ సమాజం సూటిపోటి మాటలతో పొడుస్తున్నప్పటికీ తన అత్తమామల కుటుంబానికి అండగా నిలబడిందంటూ ఆమెకి హాట్సాఫ్ అంటోంది ఈ అమ్మడు.

తాజాగా మారుతీ రావు మరణం పై స్పందించిన అమృత తన తండ్రి ఆస్తి విషయంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఇందులో తన తండ్రికి చెందినటువంటి ఆస్తి తనకు ఒక్క చిల్లిగవ్వ కూడా అవసరం లేదని, అలాగే తన తల్లి వద్దకి తన అత్తమామలను వదిలిపెట్టి వెళ్లనని ఒకవేళ తన తల్లి తన దగ్గరకు రావాలనుకుంటే నిరభ్యరంతగా రావచ్చని ఆమె బాధ్యతలను కూడా తీసుకుంటానని అమృత చెప్పుకొచ్చింది.దీంతో నెటిజన్లు అమృతకు అండగా నిలుస్తున్నారు.అంతేగాక తన భర్త మరణానికి కారణమైన అటువంటి తన తండ్రి మారుతీ రావుని కడసారి చూపు చూసుకునేందుకు వెళ్లిన అమృతని అడ్డుకోవడం చాలా దురదృష్టకరమని ఇలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదని కొంతమంది అమృత పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.