టిడిపి అధినేత చంద్రబాబు నాయుడే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.ఎట్టి పరిస్థితుల్లో ఆయన చంద్రబాబును, ఆ పార్టీలో ఉన్న కీలక నేతలను అరెస్టు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
దీనికి నిదర్శనంగా గత చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలను పూర్తిస్థాయిలో సాక్షాలతో సహా బయటపెట్టి వారి అవినీతిని ప్రజల ముందు పెట్టేందుకు హడావుడిగా రఘునాథ్ రెడ్డి అనే పోలీస్ అధికారి నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేయడమే కాకుండా దానికి విశేషాధికారాలను కట్టబెట్టడం ఛంర్చనీయాంసంగా మారింది.ఈ సిట్ కు విశేష అధికారాలు ఉంటాయి.
కేవలం కేసులు పెట్టడమే కాకుండా, ఎవరినైనా అరెస్టు చేయగలిగే అధికారాలతో సహా, ఒక పోలీస్ స్టేషన్ కు ఉండాల్సిన అన్ని అధికారాలు ఈ సిట్ కు ఉంటాయి.

కేవలం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సిట్ ను ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి.ఈ సిట్ బృందం ఒకే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు దీనిని ఏర్పాటు చేస్తుంటారు.మంత్రివర్గ ఉప సంఘం కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ సిట్ ఏర్పాటుకు ముందే రాష్ట్ర కార్మిక శాఖ మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ఉండగా ఈఎస్ఐ లో భారీ అవకతవకలకు పాల్పడ్డారని, కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారని, ఈ అవినీతికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఇప్పుడు బయటకు విడుదల చేయడం అచ్చెన్నాయుడు ఆదేశాలతోనే ఈఎస్ఐ లో భారీగా అవకతవకలు జరిగినట్లు గా ప్రచారం చేయడం, వెంటనే సిట్ ఏర్పాటు చేయడం ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి.

గత కొంతకాలంగా వైసిపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ విమర్శలు చేస్తున్న అచ్చెన్న నాయుడును, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఎట్టి పరిస్థితుల్లో అయినా అరెస్ట్ చేయించి కనీసం కొద్ది రోజులైనా జైలులో పెట్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.ప్రస్తుతం ఈఎస్ఐ వ్యవహారం ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది.కేంద్రం కూడా ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉండడం కూడా అనేక అనుమానాలు కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు పరిస్థితిపైనే అందరూ చర్చించుకుంటున్నారు.ఇప్పటికే చంద్రబాబు పీఏ ఇంట్లో జరిగిన ఐటీ సోదాల్లో అనేక కీలక ఆధారాలు దొరకడం ఇప్పుడు ఈ ఈఎస్ఐ స్కామ్ బయటకి రావడం ఇవన్నీ చంద్రబాబు టార్గెట్ గానే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.