ఎడిటోరియల్ : అక్కడా కేసీఆర్ జగన్ హవానే ! బాబు దారెటు ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గానే కాకుండా, దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, చంద్రబాబు వారితో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ, తమకు కావాల్సిన అన్ని పనులను ఎటువంటి ఆటంకం లేకుండా చేసుకునేవారు.దీంతో చంద్రబాబుకు జాతీయ మీడియాలోనూ ఫుల్ పోకస్ లభించేది.కానీ ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత చంద్రబాబు ఏపీ రాజకీయాలకే పరిమితం అయిపోయాడు.కొంతకాలం బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, అది మధ్యలోనే రద్దయిపోవడం, ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి చెందడం, మధ్యలో కాంగ్రెస్ తో తెలంగాణలో జత కట్టి , జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడం ఇటువంటి పరిణామాలన్నీ చంద్రబాబు కు చేటు తెచ్చిపెట్టాయి.ఇప్పుడు ఆ తప్పిదాలు అన్నిటినీ సరిచేసుకుని బీజేపీకి దగ్గరవడం ద్వారా, మళ్లీ తన ఇమేజ్ ను సంపాదించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

 Tdp Chandrababu Telangana Ap Kcr Congress Bjp Central Government Aliance Ap, Bjp-TeluguStop.com

ఏదో ఒక రకంగా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతున్నారు.బీజేపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, దాన్ని సమర్థిస్తూ చప్పట్లు కొడుతున్నారు.ఎన్ని చేసినా బీజేపీ నుంచి స్పందన కనిపించడం లేదు.కానీ ఏపీలో తన రాజకీయ బద్ధ శత్రువైన జగన్ తో కేంద్ర బీజేపీ పెద్దలు సన్నిహితంగా ఉంటూ, ఆయనకు ప్రాధాన్యం ఇస్తూ ఉండడం, జగన్ సైతం కీలక బిల్లులు, ఓటింగ్ సమయంలోనూ బీజేపీకి మద్దతుగా నిలవడం, ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా యుద్ధం జరుగుతున్నా పట్టించుకోకుండా, కేంద్రం లో జగన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండడంతో పాటు, రాజ్యసభలో వైసీపీ కి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసి, బీజేపీ కూడా జగన్ తో సన్నిహితంగా ఉంటూ వస్తోంది.

Telugu Chandrababu, Jagan, Telangana, Ysrcp-Telugu Political News

ఈ పరిణామాలతో ఇక బీజేపీ తమను చేరదీసే అవకాశమే లేదని చంద్రబాబు గ్రహించారు.బీజేపీ వ్యతిరేక పార్టీలతో జత కలిసి, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామని చూసినా, ఇప్పటి కే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.జాతీయ పార్టీ పెట్టి బీజేపీ వ్యతిరేక పార్టీలతో కూటమి పెట్టాలని చూస్తున్నారు.మమతాబెనర్జీ వంటి వారితోనూ ఇప్పటికే సంప్రదింపులు చేశారు.దీంతో ఇప్పుడు ఆ కూటమి వైపు వెళ్లేందుకు కూడా చంద్రబాబుకు అవకాశం లేకపోయింది.దీనికి కారణం అటు కెసిఆర్ కానీ, ఇటు జగన్ కానీ, రాజకీయ బద్ధ శత్రువులే.

దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో చంద్రబాబు ఉండిపోయారు.ఇదే టీడీపీ రాజకీయ భవిష్యత్తును డైలమాలోకి నెట్టేస్తోంది.ఈ పరిస్థితుల్లో ఇక జాతీయ రాజకీయాలపై ఫోకస్ తగ్గించి ఏపీలోనే ఎలా బలపడాలి ? ప్రజల్లో ఏ విధంగా బలం పెంచుకోవాలి అనే విషయంపైన దృష్టిపెడితే బాబు కు కానీ టీడీపీకి రాజకీయంగా ముందు ముందు మంచిరోజులు వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube