జ‌గ‌న్‌పై కేసీఆర్ కోపంగా ఉన్నారా?...దానికి కారణమిదేనా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై కోపంగా ఉన్నారా? ప్రస్తుత పరిణామాలను చూస్తే అలానే అనిపిస్తుంది.దీని వెనుక పెద్ద కారణమే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమ‌వుతున్నాయి.

 Will Jagan Leaders Supports Kcr National Party ,general Elections 2019, Jaganmoh-TeluguStop.com

జ‌గ‌న్‌తో చాలా కాలం కేసీఆర్‌ స‌న్నిహితంగా మెదిలారు.అయితే మారుతున్న స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై కేసీఆర్ కోపంగా ఉన్నరంట.

గ‌త కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రులు హ‌రీష్‌రావు, గంగుల క‌మ‌లాక‌ర్ ప్రకారం విమ‌ర్శలు చేశారు.ఈ విమ‌ర్శల‌కు ఏపీ మంత్రులు కూడా దీటుగా సమాధానమిచ్చారు.

తెలంగాణ మంత్రులపై ఏపీ మంత్రులు మాట‌లతో విరుచుపడ్డారు.అక‌స్మాత్తుగా రెండు ప్రభుత్వాల మధ్య ఇంత పెద్ద గొడ‌వ ఎందుకొచ్చింద‌నే దానిపై అనేక ప్రశ్నలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ చేసిన వ్యాఖ్యల్లో కేసీఆర్ ఆగ్రహానికి సంబంధించిన కార‌ణాలు కనిపిస్తున్నాయి.వైసీపీ బీజేపీ బీ టీంలా ప‌ని చేస్తోంద‌ంటూ గంగుల చేసిన ఘాటు వ్యాఖ్యలు కేసీఆర్ మదిలోని మాటలుగా తెలుస్తోంది.

జాతీయ పార్టీ ప్రారంభించాలకున్న జ‌గ‌న్ ప్రభుత్వంపై ఇలా రాజ‌కీయ దాడి చేయ‌డం వెనుక వ్యూహం ఏంటో తెలయడం లేదు. బీజేపీతో జ‌గ‌న్ స‌న్నిహితంగా ఉండ‌డం కేసీఆర్‌కు నచ్చడం లేదు.

తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీ నుంచి తనకు మ‌ద్దతు లభించకపోవడం కొంత అసహనంతో ఉన్నారు.కేసీఆర్ జాతీయ పార్టీ ఏపీలో పోటీ చేస్తే జగన్ అడ్డంకులు సృష్టించవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.ఒక్కవేళ ఏపీ నుండి పోటీ చేసిన కేసీఆర్‌కు మద్దతు లభించదని భావిస్తున్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ ప్రజానీకంపై దూష‌ణ‌ల‌ను ఎప్పుడూ మ‌రిచిపోదు.కావున కేసీఆర్ తన జాతీయ‌ పార్టీకి ఏపీలో మద్దతు లభించదు కాబట్టి ఏపీ రాజ‌కీయ నాయకులతో పెద్ద సంబంధాలు అవసరం లేదని కేసీఆర్ భావిస్తు్న్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube