Revanth Reddy KTR : కేటీఆర్ కు సన్మానం చేస్తానంటున్న రేవంత్ ! 

తెలంగాణ కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉంటూ, ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు గట్టిగా కష్టపడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.ముఖ్యంగా తమకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టిఆర్ఎస్ పైన , ఆ పార్టీ అధినేత కేసిఆర్,  ఆయన కుమారుడు కేటీఆర్ పైన రేవంత్ ఎప్పుడు విమర్శలు చేస్తూ,  టార్గెట్ చేస్తూ ఉంటారు.

 Revanth Wants To Honor Ktr , Revanth Reddy, Telangana, Congress, Pcc Chief, Aicc-TeluguStop.com

ఇప్పటికే అనేక అంశాల్లో ఇరుకుని పెట్టే విధంగా రేవంత్ వ్యవహారాలు చేశారు.టిఆర్ఎస్ కు తెలంగాణలో ఇకపై ఆదరణ ఉండదని,  రాబోయే ఎన్నికల్లో గెలుస్తామంటూ రేవంత్ ఇప్పటికే అనేక సార్లు సవాళ్లు చేశారు.

రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ లో కేటీఆర్ కీలకం కాబోతున్న నేపథ్యంలో, రేవంత్ మరింతగా టార్గెట్ చేసుకున్నారు.ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పై తాజాగా విమర్శలు చేశారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసి ఓటమి చెందిన కొడంగల్ నియోజకవర్గాన్ని కేటీఆర్ దత్తత తీసుకున్నారని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే అక్కడ అఖిలపక్ష సమావేశం నిర్వహించి మంత్రిని స్థానిక ఎమ్మెల్యేను సన్మానించే బాధ్యత తనది అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.కొడంగల్ నియోజకవర్గాన్ని నాలుగేళ్ల క్రితమే దత్తత తీసుకుని ఏం అభివృద్ధి చేశారని రేవంత్ ప్రశ్నించారు.

మునుగోడును దత్తత తీసుకుంటానని ఉప ఎన్నిక సందర్భంగా ప్రకటించారు.గెలిచిన వెంటనే అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Telugu Aicc, Congress, Pcc, Revanth Reddy, Telangana-Political

కొడంగల్ లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపొంది నాలుగేళ్లయినా,  ఒక్కసారైనా అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష నిర్వహించి నిధులు కేటాయించారా అని రేవంత్ నిలదీశారు.మహబూబ్ నగర్ లో కేసీఆర్ నిర్వహించిన సమావేశం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల గురించి కెసిఆర్ ప్రకటన చేయలేదని , గోదావరి జిల్లాలను ఈ ప్రాంతానికి అందించేలా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయత్నం చేస్తే,  కెసిఆర్ దానిని నిర్వీర్యం చేశారని రేవంత్ మండిపడ్డారు.ఇక తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న ధరణి భూ సమస్యలు,  భూమి హక్కు,  వ్యవసాయం, రైతాంగ సమస్యల పరిష్కారంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాకు రేవంత్ పిలుపునిచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube