యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తు్న్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను జనవరి 8వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.
కాగా ఈ సినిమా తరువాత తారక్ మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాను ఇటీవల అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్.
ఈ సినిమాను కళ్యాణ్ రామ్ మరియు రాధాకృష్ణ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాలో తారక్ సరసన పూజా హెగ్డే, రష్మిక మందనల పేర్లు వినిపించాయి.అయితే త్రివిక్రమ్ తనకు బాగా కలిసొచ్చిన ఇద్దరు హీరోయిన్లను ఈ సినిమాలో నటింపజేయాలని ఆలోచిస్తున్నాడు.
ఇందులో భాగంగా స్టార్ బ్యూటీ సమంత, అందాల భామ పూజా హెగ్డేలను ఈ సినిమాలో హీరోయిన్గా పెట్టాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడు.ఈ కథలో ఇద్దరికీ కూడా ప్రాముఖ్యం ఉన్న పాత్రలు ఉండటంతో వారైతే సినిమాకు పూర్తి న్యాయం చేస్తారని ఆయన భావిస్తున్నాడు.
ఇక తారక్‌తో ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా గతంలోనే నటించారు.మరి ఈ ఇద్దరు హీరోయిన్లతో కలిసి తారక్ ఎలాంటి సినిమాతో మనముందుకు వస్తాడా అనేది చూడాలి.







