యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో పడ్డారు.భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ సినిమాగా నిలవడంతో తన నెక్ట్స్ మూవీని ఎలాగైనా సక్సెస్ చేయాలని చూస్తున్నాడు ఈ హీరో.
దీంతో మరోసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో మనముందుకు రావడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కస్తున్న ప్రభాస్, తన నెక్ట్స్ మూవీని కూడా రెడీ చేసే పనిలో పడ్డాడు.
గతంలో ప్రభాస్ నటించిన మిర్చి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేయడంతో ప్రభాస్ అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు.
ఆ తరువాత కొరటాల శివ వరుసబెట్టి సినిమాలు చేస్తూ అన్నింటిని బ్లాక్‌బస్టర్ హిట్లుగా చేశాడు.దీంతో ప్రభాస్ కొరటాల శివ డైరెక్షన్‌లో మరో సినిమా చేయడానికి రెడీ అవతున్నాడు.
ఈ క్రమంలో కొరటాల ప్రభాస్ కోసం ఓ అదిరిపోయే కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.ఆ కథను విన్న ప్రభాస్ వెంటనే ఓకే చప్పాడని, తన ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి కాగానే కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్.
మరి ప్రభాస్ కోసం కొరటాల ఎలాంటి కథను రెడీ చేస్తాడో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.