ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుపుత్రుడు.మాజీ మంత్రి.
ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆ వైసీపీ ఎంపీకి ఫిదా అయ్యాడట.ఎందుకు అయ్యాడో.
ఎవరికి అయ్యాడో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.అసలు ఏం జరిగింది అంటే.
నిన్న లోక్ సభలో ఓ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పేరుతో చంద్రబాబు స్కామ్ చేశారని ఆరోపణలు చేశారు.
అయితే ఆ ఆరోపణలపై నారా లోకేష్ స్పందిస్తూ సెటైర్లు వేశాడు.
ఆ సెటైర్లు చూస్తే ఎవరైనా అవాక్ అవ్వలసిందే.ఆఖరికి చినబాబు కూడా సెటైర్లు వేస్తున్నాడు అని ఆశ్చర్యపోవాల్సిందే.
అంతగా నారా లోకేష్ ఏం కౌంటర్ ఇచ్చారంటే.ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.”అది ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌనో, విలేజో కాదు మాస్టారు అంటూ సెటైర్లు పేలచారు లోకేష్.ఆ కంపెనీ పేరు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్.
కంపెనీ పేరు కూడా తెలుసుకోకుండా ‘ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ చంద్రబాబుగారి బినామీ కంపెనీ’ అంటూ పార్లమెంటులో చేసిన కామెడీ నన్ను ఫిదా చేసింది” అంటూ ట్విట్ చేశారు.
అంతేకాదు.ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ లో సీఎం జగన్ కూడా పెట్టుబడు పెట్టారని, అంతర్జాతీయ సంస్థ ఉత్తరాంధ్రకి రావడం సీఎం జగన్ కు ఇష్టం లేదని, ఉత్తరాంధ్ర యువతకి ఉద్యోగులు రాకూడదని, ఉత్తరాంధ్ర ఎప్పుడు వెనుకబడి ఉండాలి అనే దురుద్దేశంతో సీఎం జగన్ ఉన్నారని చిలుక పలుకులు పలికాడు నారా లోకేష్.
దీంతో ఈ ట్విట్లు చుసిన నెటిజన్లు స్పందిస్తూ.
మీకన్నా వంద రేట్లు మంచిగానే అన్నారు.నువ్వు ట్విట్టర్ లో తప్ప ఎక్కడ మాట్లాడలేవు.
అందుకే నిన్ని ట్విట్టర్ పక్షి అని పిలిచేది అని ఒక నెటిజన్ ఫైర్ అవుతే.మరొకరు స్పందిస్తూ.”అందుకేనా పాలనా రాజధానిగా విశాఖ పనికిరాదంటూ మీ పనికిమాలిన పచ్చ మీడియా విశాఖపై విషం చిమ్ముతుంది ?” అంటూ మండిపడుతూ ట్విట్ చేశారు నెటిజన్లు.