చిట్లిన జుట్టుతో చింతే వద్దు.. ఒక్క గుడ్డు తో ఇలా రిపేర్ చేసుకోండి!

జుట్టు చిట్లడం అనేది కోట్లాది మందిని సర్వసాధారణంగా వేధించే సమస్య.ముఖ్యంగా మగువల్లో ఈ సమస్య మరీ అధికంగా కనిపిస్తుంటుంది.

 How To Repair Split Ends With Egg! Egg Hair Mask, Hair Mask, Latest News, Split-TeluguStop.com

చిట్లిన జుట్టును చాలా మంది కత్తిరిస్తూ ఉంటారు.అయితే కత్తిరించడమే పరిష్కారం కాదు.

మీరు కత్తిరించిన కొద్ది రోజులకే మళ్ళీ జుట్టు చిట్లిపోతూ ఉంటుంది‌.కానీ ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే చిట్లిన జుట్టు రిపేర్ అవ్వడమే కాదు మళ్ళీ మళ్ళీ కురులు చిట్లకుండా సైతం ఉంటాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

గుడ్డు( Egg ).ఆరోగ్యానికి వెరీ గుడ్ అన్న విషయం అందరికీ తెలుసు.గుడ్డులో అనేక పోషక విలువలు నిండి ఉంటాయి.

అవి ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.అలాగే జుట్టు సంరక్షణకు కూడా గుడ్డు ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా చిట్లిన జుట్టును రిపేర్ చేసేందుకు గుడ్డు అద్భుతంగా సహాయపడుతుంది.అందుకోసం ముందుగా బౌల్ తీసుకుని అందులో ఒక గుడ్డును బ్రేక్‌ చేసి వేసుకోవాలి.

Telugu Egg, Care, Care Tips, Latest, Split Ends, Splitends-Telugu Health

అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Ricinus ) వేసి స్పూన్ సహాయంతో అన్ని కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Egg, Care, Care Tips, Latest, Split Ends, Splitends-Telugu Health

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే చిట్లిన జుట్టు కొద్ది రోజుల్లోనే రిపేర్ అవుతుంది.జుట్టు స్మూత్ గా షైనీగా మారుతుంది.తరచూ ఈ రెమెడీని పాటిస్తే జుట్టు మళ్లీ మళ్లీ చిట్లకుండా సైతం ఉంటుంది.

పైగా ఈ ఎగ్ హెయిర్ మా( Hair mask )స్క్ ను వేసుకోవడం వల్ల కుదుళ్ళు దృఢంగా మారతాయి.జుట్టు రాలడం సైతం తగ్గుతుంది.కాబట్టి ఎవరైతే చిట్లిన జుట్టు సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారో వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube