చిరుకు నంది వద్దేవద్దు

చాలా సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇచ్చే నంది అవార్డులను పక్కకు పెట్టేసిన విషయం తెల్సిందే.రాష్ట్ర విడిపోయినప్పటి నుండి.

 Tamma Reddy Bardwaja Comments On Chiranjeevi-TeluguStop.com

అంతకు ముందు కూడా తెలంగాణ ఉద్యమం కారణంగా నంది అవార్డులను ప్రకటించడం ఇవ్వకుండా వదిలేయడం జరిగింది.తెలుగు రాష్ట్రాలు రెండు అయిన నేపథ్యంలో ఏ రాష్ట్రం నంది అవార్డుల బాధ్యతను తీసుకోలేదు.

ఈ విషయం సినీ పరిశ్రమ వారిని తీవ్రంగా కలచి వేస్తుంది.తాజాగా తెలంగాణ ప్రభుత్వం అందుకు ముందుకు వచ్చిందట.

Telugu Chiranjeevi, Nandhi Awards, Tammareddy-Movie

ఇటీవల మంత్రి తలసాని స్వయంగా చిరంజీవిని కలిసి నంది అవార్డులు ఇవ్వాలనుకుంటున్నాం.మీరు కమిటీ చైర్మన్‌గా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని నంది అవార్డుల విజేతలను ఎంపిక చేయాలంటూ చిరంజీవిని కోరడం జరిగిందట.అందుకు చిరంజీవి కూడా ఓకే చెప్పాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.అయితే చిరంజీవి నంది అవార్డుల జ్యూరీ కమిటీ చైర్మన్‌గా ఉంటే విమర్శలు తప్ప మరేమి ఉండవని తమ్మారెడ్డి భరద్వాజ అంటున్నాడు.

Telugu Chiranjeevi, Nandhi Awards, Tammareddy-Movie

ఆ పదవికి ఎవరైనా పనిలేని వారిని పెడితే బాగుంటుంది.సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ఆ బాధ్యతను నెత్తిన పెట్టుకోవడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నాడు.ఎంత కరెక్ట్‌గా అవార్డులను ఇచ్చినా కూడా కొందరు తమకు రాలేదనే ఉద్దేశ్యంతో విమర్శలు చేస్తారు.ఫ్యాన్స్‌ విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా చిరంజీవికి నంది అవార్డుల బాధ్యత వద్దే వద్దు అంటూ తమ్మారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube