సిఏఏకి సపోర్ట్ చేసిన రజినీకాంత్! బీజేపీలో చేరిపొండి అంటున్న కాంగ్రెస్ నేతలు

తమిళ రాజకీయాలు ఇప్పుడు వేడెక్కుతున్నాయి.త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

 Rajanikanth Caa Congress Tamilnadu-TeluguStop.com

అధికార పార్టీ అన్నాడిఎంకే పరిస్థితి చూస్తూ ఉంటే ఈ సారి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.ఆ పార్టీ మొత్తం బీజేపీ కనుసన్నల్లో నడుస్తుందనే అభిప్రాయం వినిపిస్తుంది.

ఇక డిఎంకే నేత స్టాలిన్ మాత్రం పీకేని పొలిటికల్ సలహాదారుగా పెట్టుకొని అధికారంలోకి వచ్చి మొదటి సారి ముఖ్యమంత్రి కావాలని ఆశ పడుతున్నాడు.అయితే అతనికి సూపర్ స్టార్ రజినీకాంత్ రూపంలో ఇప్పుడు ఇబ్బంది ఎదురవుతుంది.

ఎప్పటి నుంచో రాజకీయాలలోకి రావాలని చూస్తున్న రజినీకాంత్ దానికోసం సరైన ఫ్లాట్ ఫాం ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.అయితే రజిని బీజేపీ మీద ఎప్పటికప్పుడు తన ప్రేమ చూపించుకుంటూ ఉంటారు.

రజిని కొత్తగా పార్టీ పెట్టాలని అతని అభిమానులు ఆశిస్తున్న ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేయడం లేదు.ఈ మధ్య కాలంలో తరుచుగా బీజేపీ నేతలకి టచ్ లో ఉంటున్నారు.

ఈ నేపధ్యంలో బీజేపీ పార్టీలో చేరి తమిళనాడులో రాజకీయ ప్రస్తానం మొదలు పెడతారనే టాక్ కూడా వినిపిస్తుంది.దీనికి బలం చేకూర్చే విధంగా తాజాగా దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పౌరసత్వ సవరణ చట్టంకి మద్దతు తెలిపారు.

ఇది కేవలం ఇతర దేశాలలో ఉండే మైనార్టీల కోసం తప్ప ఇక్కడ ఉండే ముస్లింలని బయటకి పంపించడానికి కాదని రజిని మీడియాతో చెప్పుకొచ్చారు.ముస్లింలకి తాను అండగా ఉంటానని, మోడీ ప్రభుత్వం ఇండియాలో ఉన్న ముస్లింలకి వ్యతిరేకంగా ఎలాంటి చట్టాలు చేయదని అన్నారు.

అయితే రజిని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు.ఇక బయట ఈ నాటకాలు ఆపేసి బీజేపీ పార్టీలో తొందరగా చేరిపోతే సంతోషిస్తాం అని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube