మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రెస్టీజియస్ మూవీ సైరా నరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది.బ్రిటిష్ వారిని ఎదురించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధను ప్రజలకు చూపించాలనే చిరంజీవి కలను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నెరవేర్చాడు.
ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న బుల్లితెరలో ప్రసారం చేశారు.జెమినీ టీవీలో ప్రసారమైనా ఈ సినిమాకు 11.8 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాకు ఇంకా ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వస్తుందని చిత్ర యూనిట్ భావించింది.వచ్చిన టీఆర్పీ రేటింగ్‌తో చిత్ర యూనిట్ నిరాశకు లోనయ్యారు.కాగా ఇదే సినిమాను తమిళంలో కూడా బుల్లితెరపై ప్రసారం చేయగా అక్కడ 15.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.
అంటే, సైరా సినిమాను తెలుగు జనాలకంటే కూడా తమిళ తంబీలే ఎక్కువ చూశారని తెలుస్తోంది.ఇక కన్నడ వర్షన్‌కు 6.3 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది.ఏదేమైనా చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాకు తెలుగులో తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడంతో ఆయన ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు.
కాగా ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.