ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్లో ఓవర్‌నైట్ గుర్తింపు పొందిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది.అయితే ఈ బ్యూటీకి ఆ సినిమా తెచ్చిన గుర్తింపును మరే ఇతర సినిమా ఇవ్వలేకపోయింది.
ఆర్ఎక్స్ 100 బ్యూటీ హీరోయిన్గా మాత్రమే ఆమెను గుర్తిస్తున్నారు.పాయల్ రాజ్‌పుత్ ఇటీవల వెంకీ మామ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
అయితే ఆమెకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలు రాకపోవడంతో పాయల్ రాజ్‌పుత్ బాగా ఫీలవుతోందట.తనకు అవకాశాలు కూడా పెద్దగా లేకపోవడంతో మళ్లీ ఆర్ఎక్స్ 100 బాటలో నడిచేందుకు రెడీ అవుతోంది.
స్కిన్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆమెకు వెన్నెతో పెట్టిన విద్య.సినిమాల్లో అవకాశాలను దక్కించేందుకు ఈ బ్యూటీ ఎక్స్‌పోజింగ్‌తో దర్శకనిర్మాతలను మరోసారి బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
తాజాగా పాయల్ రాజ్‌పుత్ నటించబోయే సినిమాలో రెచ్చిపోయి ఎక్స్పోజింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఏదేమైనా అవకాశాలు తగ్గడంతో అమ్మడు అందాల ఆరబోతతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.మరి స్కిన్ షోతో పాయల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.