ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్.జగన్ తనదైన శైలిలో పరిపాలనను కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నారు.
పలువురు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నా అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకుపోతున్నాడు. ఇందులో భాగంగా ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పినట్లు ఒక్క అంశాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నాడు.
అయితే తాజాగా రాష్ట్ర ఎన్నికల సమయంలో చేనేత కుటుంబాలకు అండగా ఉంటానని, అంతేగాక వారికి ప్రభుత్వం తరఫున సహాయం చేస్తానని వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే.అయితే అందుకు గాను ఈ రోజున అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో వైయస్సార్ నేతన్న నేస్తం పథకం ఆధారంగా రాష్ట్రంలోని 85 వేల మంది చేనేత కుటుంబాల ఖాతాల్లోకి 24 వేల రూపాయలు జమ చేసేందుకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సమయంలో చేనేతలకు అండగా ఉంటామని ఏదైతే హామీ ఇచ్చానో ఆ హామీ మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత నేతన్నలకు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని, ఈ ఉద్దేశంతోనే ల్యాప్ టాప్ లో బటన్ నొక్కు తున్నానని అన్నారు.అంతేగాక చేనేత వస్త్రాలకు పేరుగాంచిన ధర్మవరం పట్టణంలోనే 10, 700 మంది కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని అన్నారు.అయితే జిల్లా వ్యాప్తంగా అక్షరాల 27 వేల మంది నేతన్నల కుటుంబాలకు మేలు జరుగుతుందని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 85వేల మందికి లబ్ది చేకూరుతుందని తెలిపారు.
అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇ లాప్టాప్ లో బటన్ నొక్కగానే అర్హులందరికీ తమ ఖాతాలో 24 వేల రూపాయలు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా మరికొద్ది సమయంలో డబ్బులు జమ చేయబడనున్నాయని సందేశాలు వెళ్ళాయి.
దీంతో లబ్ధిదారులు కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.