అమెరికాలోని టెక్సాస్ రాష్టంలో డల్లాస్ లో మొదలయిన నాట్స్ 6 వ తెలుగు సంబరాలు ఎంతో ఉశ్చాహంగా జరిగాయి.మే 24 న ప్రారంభం అయిన ఈ సబరాలు.
మే 26 వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి.ముగింపు రోజైన ఆదివారం శ్రీనివాస కళ్యాణ్ తో ప్రారంభం అయ్యింది.
ప్రేం కలిదిండి, ఆది గెల్లి దంపతులు స్వామి వారి కళ్యాణం లో పాల్గొన్నారు.
ఈ కార్యకంలోనే నాట్స్ డైరెక్టర్స్ బోర్డ్ చైర్మెన్ గుత్తికొండ అధ్యక్షతన 2021 , 7వ నాట్స్ తెలుగు సబరాలు జరపడానికి వేదికని సైతం ఖరారు చేసేశారు.
ఇదే వేదికపై నుంచీ నాట్స్ కార్యవర్గం అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాసబాబు నేతృత్వంలో సేవా కార్యక్రమాలు ,హెల్ప్ లైన్ వంటి వాటి కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు.అమెరికాలో పుట్టిపెరిగిన స్థానిక సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు అష్టావధానంతో అతిథులను అబ్బురపరిచారు.
కార్యక్రమంలో భాగంగా యువతీ యువకులు నాట్యాలు, నృత్యాలతో, సాంస్కృతిక ప్రదర్సనలతో అందరిని ఆకట్టుకున్నారు.“మా బాణీ-మీ వాణి” పేరుతో హిందీ పాటలని తెలుగులోకి తర్జుమా చేస్తూ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.భోజన సమయంలో తెలుగు వంటలని వడ్డిస్తూ, ఎంతో సందడి చేస్తూ కార్యక్రమానికి ముగింపు పలికారు.