ఎదురుకాల్పుల్లో గాయపడిన జవాన్.... చికిత్స పొందుతూ మృతి

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా లో గురువారం ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందగా, ఆర్మీ జవాన్ రోహిత్ కుమార్ యాదవ్ తీవ్రంగా గాయపాలయ్యాడు.

దీనితో వెంటనే రోహిత్ ను ఆర్మీ ఆసుపత్రి కి తరలించి వైద్యం అందించినప్పటికీ కూడా శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది.పుల్వామా జిల్లా లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు పక్కా సమాచారం అందడం తో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో ముష్కరులు బలగాలపై కాల్పులకు తెగబడడం తో అప్రమత్తమైన భద్రతా దళాలు వెంటనే ఎదురుకాల్పులు జరిపారు.దీనితో ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందగా, ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ జవాన్ రోహిత్ తీవ్రంగా గాయపడ్డారు.

అయితే ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న రోహిత్ ఈ రోజు ఉదయం ప్రాణాలు విడిచినట్లు తెలుస్తుంది.జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలే లక్ష్యంగా ఉగ్రవాదులు తరచూ అక్కడ చొరబాట్లు కు ప్రయత్నించి కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు