జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు, పుల్వామా ఉగ్ర దాడి సూత్రధారి మసూద్ అజహర్ మీద యాక్షన్ తీసుకోవాలని అతనిని టెర్రరిస్ట్ గా గుర్తించాలని, జైషే మహ్మద్ మీద నిషేధం విధించాలని భారత్ పాకిస్తాన్ ని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తుంది.ఇక అంతర్జాతీయంగా కూడా మసూద్ అజహార్ ని టెర్రరిస్ట్ గా గుర్తించాలని ప్రపంచ దేశాల ద్వారా పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది.
అయితే మసూద్ తమ దేశంలో లేడని ఇన్ని రోజులు పాకిస్తాన్ అబద్ధాలు ఆడుతూ వచ్చింది.
ఇదిలా వుంటే పుల్వామా దాడి తర్వాత భారత్ దౌత్య పరంగా మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ని దోషిగా నిలబెట్టింది.
దీంతో ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, రష్యా దేశాలు మసూద్ అజహర్ మీద తక్షణం యాక్షన్ తీసుకొని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలని తమ ఆదీనం చేసుకొని మసూద్ ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేసాయి.దీంతో పాకిస్తాన్ ఇప్పటికి దిగి వచ్చి మసూద్ అజహర్ తమ దేశంలోనే ఉన్నాడని, అయితే అతను భాగా క్షీణించి, ఇంటి నుంచి బయటకి రాలేని స్థితిలో ఉన్నాడని పాకిస్తాన్ మంత్రి ఖురేషి వెల్లడించారు.
అయితే అతని మీద యాక్షన్ తీసుకునే విషయంలో మాత్రం పాకిస్తాన్ స్పందించలేదని చెప్పాలి.