టీడీపీలో సీనియర్ నాయకుడుగా… ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉత్తరన్ధ్ర సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు హత్యకు కుట్ర జరిగినట్టు తగిన ఆధారాలతో సోషల్ మీడియాలో ఓ వీడియో దర్శనం ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మాఆరింది.అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది పక్కన పెడితే… అసలు ఈ కుట్రకు ఎవరు పాల్పడే అవకాశం ఉంది… అయ్యన్న కు ఉన్న శత్రువులు ఎవరు.? అసలు ఆయన్ను చంపే అంత కక్ష ఎవరికి ఉంది అనేది అందరిలోనూ అనేక అనుమానాలు రేపుతున్నాయి.సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారం గా చూస్తే.
ఈ కుట్రలో ప్రధాన పాత్రదారి అయ్యన్న సోదరుడు చింతకాయల సన్యాసి నాయుడు అని ప్రచారం జరుగుతోంది.
అంతే కాదు ఈ కుట్రలో అయ్యన్న సోదరుడితో పాటు … కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు… కొంతమంది మావోయిస్టుల సాయంతో స్కెచ్ వేసారా అనే అనుమానాలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి.అయ్యన్న కుటుంబానికి సంబంధించినవారే ఆయన హత్యకు కుట్ర చేశారు అనే ఆరోపణలు ఆ వర్గం నుంచి తీవ్రంగా వినిపిస్తున్నాయి.ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ప్రత్యర్థుల ఇళ్లపై అయ్యన్న అనుచరులు దాడులకు దిగినట్టుగా కూడా తెలుస్తోంది.ఇంత వివాదం రేపడానికి కారణం అయిన ఈ వీడియో లో ఉన్న విషయం ఏంటి అంటే…?
ఇటీవల నగరంలోని ఓ హోటల్ లో లోకల్ వైసీపీ లీడర్లు… కొంతమంది నాయకులు, మావోయిస్టు సానుభూతిపరులు మరికొందరు ఇలా వీరంతా సమావేశమైనట్టుగా ఆ వీడియోలో కనిపిస్తున్నాయి.ఇంతకీ ఈ రహస్య సమావేశం ఎక్కడ, ఎందుకు జరిగిందనే కోణంలో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.నిఘా వర్గాలు కూడా దీనిపై దృష్టి సారించినట్టు సమాచారం.అయితే మంత్రి అయ్యన్న కుటుంభంలో ఏర్పడిన ఆధిపత్య పోరు కూడా దీనికి ఒక కారణంగా తెలుస్తోంది.
ఇక మంత్రి కుమారుడు చింతకాయల విజయ్ గడచిన నాలుగేళ్లుగా రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నాడు.ఇప్పటికే.
నియోజక వర్గంలో యాత్రలు నిర్వహిస్తూ, కార్యకర్తలతో టచ్ లో ఉంటూ తన రాజకీయ భవిష్యత్తుకి బాటలు వేసుకుంటున్నాడు.దీంతో అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడి రాజకీయ భవిష్యత్తు కొంత ప్రశ్నార్థకంగా మారుతోంది.
ఈ నేపథ్యంలో ఆయన ఈ కుట్రకు తెరలేపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు ఇప్పటికే నిఘా వర్గాలు రంగంలోకి దిగి అసలు విషయం ఏంటి అనే దానిపై ఆరా తీస్తున్నాయి.