బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్( CM kcr )వచ్చే ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.గజ్వేల్ మరియు కామారెడ్డి నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నట్లు కన్ఫర్మ్ అయిపొంది.
దాంతో ఈ రెండు స్థానాల్లో ప్రత్యర్థి పార్టీల నుంచి గులాబీ బాస్ ను ఢీ కొట్టేదేవరు అనే చర్చ గత కొన్ని రోజులుగా గట్టిగా సాగుతోంది.ఈసారి కేసిఆర్ ను రెండు చోట్ల ఒడిస్తామని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు( Congress bjp parts ) ఘంటాపథంగా చెబుతున్నాయి.
దీంతో కేసిఆర్ ను ఓడించేందుకు ఈ రెండు పార్టీలు వేస్తున్న వ్యూహాలు ఏంటి ? ఎవరిని బరిలోకి దించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.అయితే గజ్వేల్ మరియు కామారెడ్డి నుంచి బరిలో దిగే అభ్యర్థుల విషయంలో హస్తం పార్టీ ఇంకా కసరత్తులు చేస్తూనే ఉందట.
కానీ బీజేపీ మాత్రం ఈ రెండు స్థానాల విషయంలో ఓ క్లారిటీతో ఉన్నట్లు వినికిడి.గజ్వేల్ బరిలో ఈటెల రాజేందర్ ( Eatala Rajende )ను బరిలో దించే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా వార్తలు వినీస్తూనే ఉన్నాయి.ఈటెల కూడా పదే పదే కేసిఆర్ ను ఓడించి తీరుతానంటూ శపథం చేస్తున్నారు.దీంతో గజ్వేల్ నుంచి ఈటెల బరిలోకి దిగడం దాదాపు ఖాయమే అని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు.
అటు కామారెడ్డి నుంచి బీజేపీ తరుపున నిన్న మొన్నటి దాకా విజయశాంతి( Vijayashanti ) పేరు వినిపించింది.ఆమె కూడా కేసిఆర్ పై పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఇటీవల చెప్పుక్కొచ్చిన సంగతి విధితమే.
అయితే ఇప్పుడు మరో నేత పేరు తెరపైకి వస్తోంది.ఆయనే నిజామాబాద్ ఎంపీ దర్మపురి అరవింద్( Arvind Dharmapuri ).కామారెడ్డిలో కేసిఆర్ కు పోటీగా అరవింద్ ను బరిలో దించితే ఎలా ఉంటుందనే దానిపై కాషాయ అధిష్టానం ఆలోచిస్తుందట.ఎందుకంటే కేసిఆర్ పై పదునైన విమర్శలు సంధించడంలో దర్మపురి ఒక్క అడుగు ముందే ఉంటారు.
అందుకే కామారెడ్డిలో కేసిఆర్ ను ఢీ కొట్టడానికి దర్మపురి అరవిందే కరెక్ట్ అని అధిష్టానం భావిస్తోందట.ఇక బీజేపీ త్వరలో ప్రకటించబోయే మొదటి అభ్యర్థుల జాబితాలో గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్, కామారెడ్డి నుంచి ధర్మపురి అరవింద్ పేరు ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గల్ల చర్చ నడుస్తోంది.
,మరి గులాబీ బాస్ తో ఢీ కొట్టి ఈ ఇద్దరు నేతలు నిలుస్తారో లేదో చూడాలి.