మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అధికార నివాసాన్ని ఖాళీ చేసిన సీఎం ఉద్ధవ్ థాకరే..!!

మహారాష్ట్ర రాజకీయాలలో నెలకొన్న సంక్షోభం నిమిష నిమిషానికి ఉత్కంఠభరితంగా మారింది.అధికార పార్టీ శివసేనకి చెందిన మంత్రి ఏకనాథ్ షిండే తిరుగుబాటు ఎగరవేయటంతో పాటు శివసేన పార్టీకి చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలను తన వైపునకు తప్పుకోవటంతో ఉద్దవ్ థాకరే ప్రభుత్వం మైనారిటీలో పడిపోవటం తెలిసిందే.

 Uddhav Thackeray Vacates Official Residence In Maharashtra, Uddhav Thackeray, Ma-TeluguStop.com

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సోషల్ మీడియా లో లైవ్ లో.ముఖ్యమంత్రి అదేవిధంగా శివసేన అధ్యక్ష పదవి నుండి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం జరిగింది.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడటం లేదని స్పష్టం చేశారు.శివసేనకి చెందిన ఎమ్మెల్యేలలో ఒకరు వద్దన్నా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.అయితే తాజాగా అధికార నివాసాన్ని ఉద్దవ్ థాకరే వీడి.సొంత నివాసం మాతోశ్రీ కి కుటుంబంతో సహా వెళ్లిపోవడం జరిగింది.

అయితే ఇప్పటి వరకు మాత్రం ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ థాకరే రాజీనామా చేయలేదు.మరోపక్క రెబల్ ఏకనాథ షిండే.

శివసేన మనుగడకోసం సహజమైన పొత్తు నుండి బయట పడటం ఎంతో అవసరమని సంచలన వ్యాఖ్యలు చేశారు.పొత్తు వల్ల శివసైనికులు నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు.

దీంతో మహారాష్ట్ర రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube