జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫోకస్ అంతా రాజాకీయాలపైనే పెట్టాడు.తన ప్రత్యర్థుల తప్పులను తప్పుపడుతూ… తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు.
మొన్నటివరకు టీడీపీ మీద .లోకేష్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన పవన్ ఆ తరువాత నుంచి కొంచెం సైలెంట్ అయ్యారు.ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా వైసీపీ అధినేత జగన్ మీదే పెట్టాడు.జనసేన – వైసీపీ పొత్తు పెట్టుకుంటుంది అని అంతా ప్రచారం చేస్తున్నారు.కానీ అందులో వాస్తవం లేదని … అసలు వైసీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం జనసేనకు ఏంటి .? కష్టమైనా నష్టమైనా తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించాడు.
ఆ తరువాత నుంచి టార్గెట్ వైసీపీ అన్నట్టుగా విమర్శలు చేస్తూ వస్తున్నాడు.అంతే కాదు జగన్ కులం మీద కూడా విమర్శలు చేసాడు.ఆ పార్టీ మీదే మొత్తం ఫోకస్ అంతా పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే తాజాగా టీడీపీ ఎంపీ… బాబు కోటరీలో కీలక నేత సుజనా చౌదరి భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకల్లో చిక్కుకున్నాడు.
ఈ వ్యవహారం పై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలపాలవ్వడమే కాదు .ఈ విషయంలో నోరు మెదపలేని పరిస్థితిలో పడిపోయింది.అయితే… ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.ఆ పార్టీ నేతలు సుజనా వ్యవహారాలపై స్పందిస్తూ బాబుకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపించారు.
సుజనా చౌదరి కేవలం బినామీ మాత్రమే అసలు దోష చంద్రబాబు అంటూ విమర్శలు చేస్తున్నారు.చంద్రబాబు నాయుడు పెద్ద ఆర్థిక ఉగ్రవాది అని వైసీపీ నేత రామచంద్రయ్య కూడా ఘాటుగా విమర్శించాడు.కానీ… ఈ విషయంలో జనసేన తరఫు నుంచి మాత్రం స్పందన లేదు.సుజనా చౌదరి వ్యవహారంలో పవన్ కల్యాణ్ సైలెంట్ అయిపోయాడు.
రాజకీయంగా టీడీపీ ఇరుకునపడ్డ ఈ సమయంలో పవన్ కూడా ఈ విషయంపై స్పందిస్తే టీడీపీ పై ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతుంది కానీ పవన్ మాత్రం నోరు విప్పడం లేదు.దీనికి కారణం ఏంటో మాత్రం ఎవరికీ అంతు పట్టడం లేదు.