అమెరికాలోని కాలిఫోర్నియా లో కేరళా రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువ దంపతుల మరణం వారి కుటుంభాలలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.వివరాలలోకి వెళ్తే.
కాలిఫోర్నియాలోని ప్రముఖ యోసెమైట్ జాతీయ పార్కులో సుమారు 800 అడుగుల అత్యంత ఎత్తైన పర్వతం పైనుంచి విష్ణు విశ్వనాథ్ (29), మీనాక్షీ మూర్తి (30) అనే ఇద్దరు దంపతులు లోయలో పడి మృతి చెందినట్లు స్థానిక వార్తా పత్రిక తెలిపింది.
విశ్వనాథ్‌కు ఇటీవలే సిస్కో సంస్థలో సిస్టమ్ ఇంజినీరుగా ఉద్యోగం రావడంతో భార్యాభర్తలిద్దరూ కొద్దిరోజుల క్రితం న్యూయార్క్ నుంచి శాన్‌జోస్ నగరానికి నివాసం మార్చారు.అంతేకాదు ఈ దంపతులకి ప్రకృతిలో తిరగడం అంటే ఎంతో ఇష్టమని అందుకే త్వరలో ఇద్దరూ కలిసి ప్రపంచ యాత్ర కూడా చేయాలనుకున్నట్లు తెలుస్తోంది.పర్వతంపై భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా దిగిన ఫోటోను విశ్వనాథ్, మీనాక్షి తమ తమ ఫేస్‌బుక్ ఖాతాల్లో పోస్టు చేశారు కూడా
అయితే ఈ సంఘటన జరిగిన తరువాత వీరి మృతదేహాలను పర్యటకులు గుర్తించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.దనతో ఈ మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు.అయితే, ఈ యువ దంపతుల మృతికి గల కారణాలేంటో తెలియాల్సి ఉంది.
అనుమానాస్పదంగా ఉన్న ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇది హత్యా , లేక ఆత్మహత్యా , ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
2 Attachments