మీ టూ ఉద్యమం ప్రస్తుతం సినీ పరిశ్రమలను వణికిస్తోంది.ఇక బాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మీ టూ ఇంతలా వేడిగా మారడానికి బాలీవుడ్ తారలే కారణం అని అందరికి తెలుసు.బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణలతో మీ టూ ప్రస్తుతం వేడిగా మారింది.
బాలీవుడ్ బ్యూటి అమైరా దస్తూర్ తాజాగా మీ టూపై స్పందించింది.తనకు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయని అమైరా చెప్పుకొచ్చింది.
తెలుగు ప్రేక్షకులకు ‘మనసుకు నచ్చింది’, ‘రాజుగాడు’ చిత్రంతో పరిచయం అయిన అమైరా తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మీ టూలో భాగంగా చెప్పుకొచ్చింది.ఒక స్టార్ హీరో అల్లుడు తనను లైంగికంగా వేధించాడని, అతడితో కలిసి సినిమా చేస్తున్న సందర్భంలో సమయం దొరికితే తనపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించే వాడని, తన మాటలతో కూడా చాలా చిరాకు కలిగించేవాడని అమైరా చెప్పుకొచ్చింది.హీరోగారి తీరు ఇలా ఉందని దర్శకుడికి చెబితే ఇక అంతా కలిసి తనతో ఆడుకున్నారని, అవసరం లేకున్నా ముందు రమ్మని, రెడీ అయ్యాక చాలా సమయం అలాగే కూచొమని చెప్పి చిత్రంగా ప్రవర్తించేవారు అని అమైరా చెప్పుకొచ్చింది.
అతడి పేరు చెబితే ఇక నా సినిమా కెరీర్ మొత్తం నాశనం అయినట్టే కాకపోతే తన పేరును కొన్నాళ్ల తర్వాత ఎలాగైనా బయట పెడతాను అంటూ అమైరా చెప్పుకొచ్చింది.ఇకపోతే బాలీవుడ్ కంటే సౌత్‌లోనే లైంగిక వేధింపులు ఎక్కువగా ఉంటాయని షాకింగ్ ఆరోపణలు చేసింది.అమైరా ఆరోపణలు విని అమైరాకు ఈ అనుభవం తమిళ సినీ పరిశ్రమలో జరిగి ఉండవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏది ఏమైనా తారలు చేసే ఆరోపణలు ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారుతున్నాయి.వీరిలో కొందరు నిజాలు చెబితే ఇంకొందరు పబ్లిసిటీ కోసం చెప్పక మానలేదు.దాంతో ఏవి నమ్మాలో ఏవి నమ్మకూడదో తెలియడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.