కేసీఆర్ ఏం చేస్తున్నాడు ... ఏం చేయబోతున్నాడు ..

ఎన్నికల కంగారులో ఉన్న టీఆరఎస్ అధినేత కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలను చక చక మార్చేస్తున్నారు.అసలు ఆయన అడుగులు ఎటుపడుతున్నాయో తెలియక అందరిలోనూ గందరగోళం నెలకొంది.

 What Is The Next Step Of Kcr On 2019 Elections-TeluguStop.com

అసలు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తో పొత్తు పెట్టుకుంటాడు ఏ పార్టీ తో సున్నం పెట్టుకుంటాడో ఎవరికీ అర్ధమే కావడంలేదు.దీనికి కారణం ఆయన నోటికొచ్చినట్టు తిట్టిన పార్టీతోనే కలిసిమెలిసి తిరగడం, కలిసి తిరిగిన పార్టీనే తిట్టడం వంటివి కేసీఆర్ చేస్తున్నారు.

ఈ దశలో ఆశలు కేసీఆర్ ఏమి చేస్తున్నాడు .? ఏమి చేయబోతున్నాడు అనే సందేహం అందరిలోనూ తలెత్తుతోంది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన వరుసగా భేటీ అవ్వడం, అలాగే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ప్రధాని కలుస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.పైకి రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని చెబుతున్నా.లోపల కథ వేరే ఉందనే టాక్ వినిపిస్తోంది.మోడీని టార్గెట్ చేస్తూ ఇష్టారీతిన మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు అదే మోడీ చుట్టూ చక్కర్లు కొట్టడంలో ఆంతర్యం ఏమిటన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు.

కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెప్పిన కేసీఆర్‌.ఇప్పుడు అదే బీజేపీకి దగ్గరవ్వడం చూస్తే ఏదో జరగబోతుందని సంకేతాలు మాత్రం వస్తున్నాయి.

జూన్ 16న నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశానికి ఒరరోజు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో సుమారు గంటన్నరసేపు భేటీ అయ్యారు.తాజాగా.

ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్‌, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ భేటీ కావడం.బీజేపీయేతర కూటమిపై చర్చించడం.

విపక్షాల ఐక్యతకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు వార్తలు వచ్చిన రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో సమావేశం అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ తదితర విపక్షాలతో మోడీ వ్యతిరేక కూటమి బలోపేతం దిశగా ముందుకు వెళ్తున్నవేళ కేసీఆర్ కదలికల్లో మతలబు మాత్రం ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.ఇదే సమయంలో ఫ్రంట్ ఏర్పాటు విషయాన్ని లేవనెత్తకుండా కేసీఆర్ మోదీ చుట్టూ తిరగడం ఎవరికీ అంతుపట్టడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube