నిజంగా ఆ పని నేను చేయలేదు.. నమ్మండి

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

శతమానంభవతి చిత్ర దర్శకుడు సతీష్‌ వేగేశ్న ఈ చిత్రంను తెరకెక్కించిన విషయం తెల్సిందే.

జాతీయ స్థాయిలో ఉత్తమ ఫ్యామిలీ చిత్రంగా శతమానంభవతి చిత్రం అవార్డు దక్కించుకున్న విషయం తెల్సిందే.దిల్‌రాజు బ్యానర్‌లో తెరకెక్కిన మరో ప్రతిష్టాత్మక చిత్రం అయిన ఈ చిత్రంపై దిల్‌రాజు చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఈ చిత్రంలో పెళ్లి తంతు ఎలా ఉంటుంది, కుటుంబ విలువలను చూపించబోతున్నారు.

‘శ్రీనివాసకళ్యాణం’ చిత్రం కాన్సెప్ట్‌ దిల్‌రాజు ఇచ్చాడని, పెళ్లి కాన్సెప్ట్‌తో దర్శకుడు సతీష్‌ వేగేశ్న కథను అల్లి, ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతూ వస్తున్నారు.అయితే సినీ వర్గాల్లో మరియు సోషల్‌ మీడియాలో మాత్రం ఈ చిత్రంకు దిల్‌రాజు షాడో డైరెక్టర్‌గా వ్యవహరించాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.దిల్‌రాజు మొత్తం తానై ఈ చిత్రాన్ని నడిపించాడని, సతీష్‌ వేగేశ్న కేవలం సహాయ దర్శకుడిగా వర్క్‌ చేశాడు అంటూ కొందరు ప్రచారం చేస్తున్న సమయంలో ఈ విషయమై దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

తాజాగా శ్రీనివాస కళ్యాణం చిత్రం ప్రెస్‌మీట్‌లో దిల్‌రాజు మాట్లాడుతూ తిరుమల దైవ దర్శనంకు వెళ్లిన సమయంలో నాకు ఈ చిత్రం ఆలోచన వచ్చింది.అదే ఆలోచనను దర్శకుడు సతీష్‌ వేగేశ్నకు చెప్పాను.

నా ఆలోచనకు తగ్గట్లుగా స్క్రిప్ట్‌ను తయారు చేసి, ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించాడు.అంతే తప్ప తాను ఈ చిత్రంలో ఏమాత్రం ఇన్వాల్వ్‌ అవ్వలేదని, ఈ చిత్రంలోనే కాదు తాను ఏ చిత్రాల మేకింగ్‌ విషయంలో కూడా ఇన్వాల్వ్‌ అవ్వను అంటూ చెప్పుకొచ్చాడు.

దిల్‌రాజు ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో ఎక్కువ సెట్స్‌కు కూడా వెళ్లేవాడు కాదట.దర్శకుడికి పూర్తి స్వేచ్చను ఇచ్చినప్పుడు మాత్రమే మంచి ఫలితం వస్తుందని తాను భావిస్తాను అంటూ దిల్‌రాజు చెప్పుకొచ్చాడు.దర్శకులకు దిల్‌రాజు ఎక్కువగా సలహాలు ఇస్తాడని, ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో పూర్తి ఇన్వాల్వ్‌ మెంట్‌ ఉంటుందని అంతా అంటూ ఉంటారు.

కాని ఆయన మాత్రం నాకే పాపం తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు.అసు విషయం ఆ పైవాడికే తెలియాలి.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు