ఎన్టీఆర్‌ మూవీలో లక్ష్మీ పార్వతి పాత్ర గురించి క్లారిటీ.. నంటించేది ఎవరంటే

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’.బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్‌ ప్రస్తుతం జరుగుతుంది.

 Balakrishna Wants Laxmi Parvathi In Ntr Biopic-TeluguStop.com

భారీ ఎత్తున ఈ చిత్రాన్ని తెరకెక్కించి వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇప్పటికే ఈ చిత్రంలో నటించబోతున్న నటీనటులపై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా మరో ముఖ్యమైన పాత్రపై క్లారిటీ ఇచ్చేందుకు సిద్దం అయ్యారు.

చంద్రబాబు నాయుడు పాత్రను రానా, బసవతారకం పాత్రను విద్యాబాలన్‌, ఏయన్నార్‌ పాత్రను సుమంత్‌ ఇంకా ప్రముఖ పాత్రల్లో పలువురు స్టార్స్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర అయిన లక్ష్మీ పార్వతి పాత్రపై చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.ఎన్టీఆర్‌ చిత్రంలో మొదట లక్ష్మీ పార్వతి పాత్రను వద్దని చిత్ర యూనిట్‌ సభ్యులు అనుకున్నారు.బాలకృష్ణకు లక్ష్మీ పార్వతికి అస్సలు పడదు.అందుకే ఈ చిత్రంలో ఆమెను చూపించవద్దని అనుకున్నారు.కాని ఎన్టీఆర్‌ చిత్రంలో లక్ష్మీ పాత్రను చూపించకుండా అసంపూర్తిగా ఉంటుందని క్రిష్‌ భావించాడు.

క్రిష్‌ ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రను బాలకృష్ణ మరియు ప్రేక్షకులు మెప్పించే విధంగా రూపొందించాడు.లక్ష్మీ పార్వతి పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఆమెను నెగటివ్‌గా చూపించకుండా సాదా సీదాగా ఆమెను చూపించబోతున్నాడు.

దాంతో బాలకృష్ణ కూడా ఆ పాత్రకు ఓకే చెప్పినట్లుగా తొస్తోంది.ఆమెకు వ్యతిరేకంగా పాత్ర ఉండదు కనుక లక్ష్మీ పార్వతి కూడా నో చెప్పే అవకావం లేదని సినీ వర్గాల వారు భావిస్తున్నారు.

మొత్తానికి దర్శకుడు క్రిష్‌ మంచి ప్లాన్‌ వేసి లక్ష్మీ పార్వతి పాత్రను ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.ఇక ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రలో ఆమని నటించబోతుంది.సీనియర్‌ హీరోయిన్‌ అయిన ఆమని ఈమద్య కాలంలో ఎక్కువగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తుంది.ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రను ఆమనితో క్రిష్‌ చేయించుతున్న కారణంగా ఆమె స్థాయి మరింతగా పెరగడం ఖాయం.

మొత్తానికి ఎన్టీఆర్‌ చిత్రంలోని ప్రతి పాత్ర కూడా ఎంతో ఆసక్తిని కలుగజేస్తోంది.అందరిని మెప్పించే విధంగా ఈ చిత్రం ఉంటుందా లేదంటే ఎవరినైనా నొప్పిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube