ముఖ చర్మం కాంతివంతంగా మారటానికి మూలికలతో ఆవిరి ఎలా పెట్టాలో తెలుసా?

మనం రోజు చర్మాన్ని శుభ్రం చేసుకోవటానికి ఎన్నో రకాలైన పద్దతులను ఉపయోగిస్తాం.అయితే కొన్ని సార్లు మంచి ఫలితం రాకపోవచ్చు.

 Natural Herbal Face Steam , Face Steam, Rose Water, Health Tips, Lemon Peel Powd-TeluguStop.com

ముఖానికి శుభ్రపర్చటం, టోనింగ్, మాయిశ్చరైజర్, వారానికి ఒకసారి ప్యాక్ వేయటం వంటివి అన్ని చేస్తూ ఉంటాం.కానీ ముఖానికి అతి ముఖ్యమైన ఆవిరి పట్టటం అనేది చేయటం మర్చిపోతూ ఉంటాం.

ఇప్పుడు ఆవిరి ఎలా పెట్టాలో చూద్దాం.ముందు ముఖాన్ని తేలికపాటి పేస్ వాష్ తో శుభ్రం చేయాలి.

ఈ విధముగ చేయకపోతే మేకప్ కి సంబంధించిన అవశేషాలు చర్మ గ్రంధుల లోపలికి వెళతాయి.అందువల్ల ఆవిరి పెట్టటానికి ముందు తప్పనిసరిగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

కొంచెం రేణువులున్న స్క్రబ్ ని ఉపయోగించి ముక్కు,నుదురు ప్రాంతాలలో ఎక్కువగా దృష్టి పెట్టటం మంచిది.స్క్రబ్బింగ్ అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేయాలి.మూడు కప్పుల నీటిని మరిగించి ఆ నీటిలో రెండు చుక్కల రోజ్ వాటర్ వేయాలి.ఇలా చేయటం వలన చర్మం శుభ్రపడి టోనింగ్ అవుతుంది.

ఆ నీటిలో అర స్పూన్ నిమ్మతొక్కల పొడిని కలిపితే చర్మంపైనా మురికిని తొలగించటమే కాకుండా నల్లని మచ్చలు కూడా పోతాయి.చివరగా 3 చుక్కల చమోమిలే (చామంతి) నూనెను వేయండి.

ఇందులో ఉండే వాపులనుతగ్గించే లక్షణం బ్యాక్టీరియాను చంపేసి, మంటతో ఉన్న పొడి చర్మానికి తేమను అందిస్తుంది.ఈ నీటితో ఆవిరి పడితే ముఖం మీద మురికి తొలగిపోయి శుభ్రం అవ్వటమే కాకుండా కాంతివంతంగా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube