మధుమేహం కారణంగా శరీరంలో కలిగే కీలకమైన మార్పులు

మధుమేహం అనేది చాలా భయంకరమైన మరియు సైలెంట్ కిల్లర్ అని చెప్పవచ్చు.మధుమేహం ఒకసారి వచ్చిందంటే జీవితాంతం మందులు వేసుకుంటూ కంట్రోల్ లో ఉంచుకోవాల్సిందే.

 The Effects Of Diabetes On Your Body Details, Diabetes, Sugar, Body, Effects On-TeluguStop.com

అలాగే ఆహార నియమాలను కూడా పాటించాలి.ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్యల్లో ఒకటిగా మధుమేహం ఉంది.

అలాంటి మధుమేహం కారణంగా మన శరీరంలో వచ్చే కీలకమైన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.

రక్తంలో చెక్కర కారణంగా రక్తనాళాలు సాగే గుణాన్ని కోల్పోయి రక్తనాళాలు సన్నపడతాయి.

దీని కారణంగా గుండె పోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి.నిజానికి, మధుమేహ వ్యాధిగ్రస్తులలో హృద్రోగ మరణాలు కలిగే అవకాశం నాలుగురెట్లు అధికంగా ఉంటుంది.

మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో రోజులు గడుస్తున్న రక్తప్రసరణ సరిగ్గా జరగక నరాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.సాధారణంగా చేతులు, కాళ్ళు మరియు వేళ్ళలో స్పర్శ కోల్పోతారు.దాంతో ఆ ప్రదేశాలలో ఏవైనా గాయాలు అయితే తొందరగా తెలుసుకోలేరు.

మధుమేహం కారణంగా మూత్రపిండాలలోని రక్తనాళాలు దెబ్బతింటాయి.దాంతో అవి రక్తంలోని వ్యర్థ పదార్థాలను వడకట్టడంలో విఫలం అవుతాయి.చివరికి ఈ పరిస్థితి మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.

మధుమేహం కారణంగా వచ్చే మైక్రో వాస్క్యూలర్ సమస్యల వలన శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగదు.దాంతో శరీరంపై, ముఖ్యంగా కొనలకు అయిన గాయాలు మానడానికి చాలా కాలం పడుతుంది.

అంతేకాకుండా చెక్కెరలు అధికంగా ఉన్న కణజాలాలలో బాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది, గాయాలను పుండ్లుగా తొందరగా మార్చేస్తుంది.ఆ పుండ్లు కూడా చాలా రోజుల వరకు తగ్గవు.

The Effects Of Diabetes On Your Body Details, Diabetes, Sugar, Body, Effects On Body, Heart Attack, Injuries, Kidneys, Blood Circulation, Nerves, Effects Of Sugar, Human Body - Telugu Diabetes, Effects Sugar, Effects, Heart Attack, Kidneys, Sugar

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube