మళ్లీ పీకల్లోతు కష్టాల్లో పూరి

సినిమా పరిశ్రమలో ఒడుదుడుకులు చాలా సహజం.అయితే గతంతో పోల్చితే ప్రస్తుత పరిస్థితి విభిన్నం అని చెప్పుకోవాలి.

 Director Puri Jagannath Struggles Again-TeluguStop.com

గతంలో అనుభవం లేకపోవడం మరియు అవగాహణ లేకపోవడం, ముందు చూపు లేకపోవడం వల్ల ఎంతో మంది స్టార్స్‌ డబ్బును దాచుకోవడం, దాన్ని ఆస్తిగా మ్చుకోవడంలో విఫం అయ్యారు.అందుకే కెరీర్‌ మంచి జోరుగా ఉన్న సమయంలో స్టార్స్‌గా ఉన్న వారు ఆ తర్వాత అవకాశాు లేని సమయంలో జీరోలుగా మిగిలిపోయి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితి వేరు.ఇప్పుడు నాలుగు ఆఫర్లు రాగానే వచ్చిన డబ్బును సరైన మార్గంలో పెట్టి నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు.

అయితే పూరి మాత్రం ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా కాకుండా పాతపద్దతిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పూరి కెరీర్‌ ఆరంభంలో మంచి సినిమాలు చేయడంతో భారీగా పారితోషికం దక్కి, అద్బుతమైన ఫామ్‌తో అందరి దృష్టి ఆకర్షించాడు.అయితే కొన్నాళ్ల తర్వాత ఎవరో మోసం చేయడం వల్ల పూరి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.ఆ ఇబ్బందుల నుండి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత బయట పడ్డాడు.

వరుసగా సినిమాలు చేస్తూ మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు.ఇలాంటి సమయంలోనే మళ్లీ పూరి చేస్తున్న పని వల్ల ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

దర్శకుడు తన స్థాయి మరియు మార్కెట్‌ను బట్టి సినిమా తీయాలి.అలా కాదని ఎక్కువ బడ్జెట్‌తో సినిమా తీస్తే నిర్మాత కొంప కొల్లేరు అవ్వడం ఖాయం.

ఇప్పుడు అదే అవుతుంది.

తన కొడుకు ఆకాష్‌ పూరితో ‘మెహబూబా’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పూరి జగన్నాధ్‌ ఆ చిత్రాన్ని స్వయంగా నిర్మించాడు.

తన కొడుకుతో తాను అయితేనే ఎక్కడ కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను నిర్మిస్తాను అనే ఉద్దేశ్యంతో సొంతంగా నిర్మించాడు.ఆ సినిమా కాస్త బడ్జెట్‌ హద్దు దాటింది.25 కోట్లతో అనుకున్న సినిమా కాస్త దాదాపు 40 కోట్లకు చేరినట్లుగా తెలుస్తోంది.

ఇంత బడ్జెట్‌ బయటి నిర్మాతలు పెట్టడం కష్టం.

అయినా కూడా తాను ఏమాత్రం వెనక్కు తగ్గకుండా కొడుకు కోసం సాహసం చేశాడు.నిర్మాణంకు డబ్బు లేకపోవడంతో తన ఇంటిని సైతం పూరి అమ్మేశాడు.

ఇల్లు అమ్మిన విషయాన్ని పూరి సైతం ఒప్పుకున్నాడు.ఇప్పుడు ‘మెహబూబా’ చిత్రం ఆశింసిన స్థాయిలో బిజినెస్‌ చేయలేదు.

అన్ని ఏరియాల్లో కలిపి 20 కోట్లకు అమ్ముడు పోయింది.అంటే ఇంకో 20 కోట్లు పూరికి రావాల్సి ఉంది.

సినిమా ఎంతటి విజయాన్ని దక్కించుకున్నా కూడా కొత్త హీరో కనుక 20 నుండి 25 కోట్ల వరకు రావడమే గగణం.దాంతో పూరికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తప్పవు అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

ఇప్పటికే ఇల్లు అమ్మేసిన పూరి నష్టంను భర్తీ చేసుకునేందుకు మరో ఆస్తిని కూడా అమ్మేసుకోవాల్సి రావచ్చు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.మొత్తానికి పూరి మరోసారి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోయే పరిస్థితి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube