తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంత కాలం నిలిచిపోయే స్టార్స్ కొందరే ఉన్నారు.వారిలో సావిత్రి గారు ఒకరు అంటే ఖచ్చితంగా అందులో అతిశయోక్తి లేదు.
తెలుగు సినిమా పరిశ్రమ ఆరంభం అయిన మొదట్లో సావిత్రి గారు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.తెలుగు తొలి తరం హీరోయిన్స్‌లో సావిత్రి గారు ముందు వరుసలో ఉంటారు.
ఎన్టీఆర్, ఏయన్నార్‌లతో పాటు అప్పటి స్టార్స్ అందరితో కూడా నటించి మెప్పించిన సావిత్రి కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.తమిళనాట అప్పటి సీనియర్ హీరోలకు సరిజోడీగా నటించి తమిళ హృదయాలను గెలుచుకున్నారు.
ఒక హీరోయిన్ లేదా హీరో స్టార్ అయ్యారు అంటే వారు మంచి సినిమాలు చేశారు అని, వారు చేసిని సినిమాలు సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్‌ను సాధించాయి అని చెప్పుకోవచ్చు.సినిమాల్లో మంచి సక్సెస్ అయితే స్టార్‌డం వచ్చేస్తుంది.కాని మహానటి అనే పేరు మాత్రం సావిత్రి గారికి కేవలం నటించడం వల్ల మాత్రమే రాలేదు.ఆమె జీవితంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలవడంతో పాటు, ఉన్నతమైన జీవితంను ఆమె జీవించారు.
అందుకే ఆమెను మహానటి అంటూ అంతా పొగుడుతూ ఉంటారు.ఆమె మంచి నటి మాత్రమే కాకుండా మంచి మనిషి అవ్వడం వల్ల ఆమెను మహానటి అన్నారు అని చెప్పుకోవచ్చు.
తాను మాత్రమే కాకుండా తన చుట్టు ఉన్న వారు అంతా కూడా బాగుండాలని, అంతా బాగుంటేనే తాను బాగున్నట్లుగా భావించిన వ్యక్తి సావిత్రి.సినిమాలో ఎంత పద్దతిగా, హుందాగా ఉండేవారో నిజ జీవితంలో కూడా అంతే పద్దతిగా, ఒక మాట ఇస్తే దానిపై నిలబడే వ్యక్తిగా హుందాగా కనిపించేవారు.
ప్రతి పనిలో కూడా నలుగురి గురించి ఆలోచించే ఆమె పేరు చెప్పుకుని వేలాది మంది జీవించేశారు.ఇప్పటికి కూడా ఆమె సాయం వల్లే ఈ స్థాయిలో ఉన్నాము అని చెప్పుకునేవారు వందల్లో ఉన్నారు అంటే నమ్మక తప్పదు.
సినిమాతో పాటు నిజ జీవితంలో కూడా ఆమె హీరోయిన్ అనిపించుకున్నారు.అందుకే ఆమె మహానటి అయ్యిందని చెప్పుకోవచ్చు.
ఇంతటి గొప్ప నటి అవ్వడం వల్లే ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రం తెరకెక్కింది.రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘మహానటి’ చిత్రంలో ఆమె గొప్పదనంను మరింతగా చూపించనున్నారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది.సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మోహన్‌బాఋ ఈ చిత్రంలో నటించడం వల్ల సినిమా స్థాయి అమాంతం పెరిగింది.
మహానటి పేరుకు తగ్గట్లుగా ఉండి ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.