దేశం కాని దేశంలో, ఎంతో భిన్నమైన సంస్కృతుల మధ్య.కొన్ని లక్షల మంది భారతీయ ప్రవాసీలు తమ తమ ఉన్నతమైన భవిష్యత్తు కోసం ఎన్నో దేశ విదేశాలు వలసలు వెళ్తూ ఉంటారు….
దాదాపు 2 కోట్లమంది భారతీయులు విదేశాలలో వివిధ కారణాల దృష్ట్యా నివసిస్తున్నారు అయితే అలాంటి వారందరిని ఒకే తాటిపైకి తీసుకు వచ్చే వేడుకనే ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకుంటారు.అయితే
ప్రతీ ఏటా జనవరి 9 న నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఇక నుంచీ అంటే 2019 నుంచి రెండేళ్లకొకసారి నిర్వహించనున్నట్టు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించారు.‘సామర్థ్య నిర్మాణం- కృత్రిమ మేధ వంటి అంశాల్లో ప్రవాస భారతీయుల పాత్ర’, ‘ప్రవాసులు మాతృభూమికి చేయగలిగిందేమిటి? .భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు వాటి పరిష్కారంలో ప్రవాసీయుల ముఖ్య భాద్యత అనే అంశాలతో థీమ్ ఆధారిత సెషన్లను నిర్వహిస్తామని తెలిపారు విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్.
అయితే ఈ కార్యక్రమానికి ఎన్నారైలతో పాటు భారత్ లో ఉంటున్న ఎన్నారై లని కూడా ఆహ్వనిస్తామని తెలిపారు.వచ్చే ఏడాది ప్రవాస భారతీయ దినోత్సవాన్ని వారణాసిలో నిర్వహించనున్నారు.
జనవరి 21 నుంచి 23 దాకా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆ సమయంలో ప్రవాసులు గంగలో కుంభస్నానం చేయవచ్చని.తర్వాత, జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవంలో పాల్గొనాలనుకునేవారికి ఆ అవకాశం కూడా కల్పిస్తున్నామని తెలిపారు.