అవును! జనసేనాని గురించి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రజా సర్వే చేయిస్తున్నారట.ఇప్పుడు ఇంకా సాగుతున్న ఈ సర్వే.
తెరచాటుగా చకచకా సాగిపోతోంది.అయితే, ఇప్పుడు ఈ సర్వే పైనే అందరి దృష్టీ ఉంది.
అసలు పవన్‌పై బాబు ఎందుకు సర్వే చేయిస్తున్నారు? ఆయన కొచ్చే లాభం ఏమిటి? లేకపోతే నష్టం ఏంటి? వంటి అనేక అంశాలపై నేతలు చర్చించుకుంటున్నారు.వాస్తవానికి చంద్రబాబు తన మంత్రులు, ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున సర్వే చేయించారు.
వారి పనితనం వాటిని అంచనా వేశారు.ఈ క్రమంలోనే పవన్ గురించి కూడా చేయిస్తున్నారా? అని అంటున్నారు.విషయం చూద్దాం.
2014 ఎన్నికలకు ముందు పవన్ జనసేన పార్టీని ఆర్బాటంగా ప్రారంభించినా.అప్పటి ఎన్నికలకు దూరంగా ఉన్నారు.అదేసమయంలో టీడీపీ, బీజేపీలకు పెద్ద ఎత్తున ప్రచారం చేసిపెట్టారు.ఇక, ఇప్పుడు 2019 లో జరగబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నాడు.ఇప్పటికే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన పవన్.
దానికి సంబంధించిన ప్రణాళికలో దూసుకుపోతున్నాడు.దీంతో చంద్రబాబు.
ఇప్పుడు పవన్ పార్టీపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.వాస్తవానికి చంద్రబాబుకి 2014, 2019లోనూ జగన్ పార్టీ వైకాపా నుంచి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.
ఇక, కాంగ్రెస్, వామపక్షాలు వంటివి ఇప్పట్లో కోలుకునే టైం లేదు.ఇక, బీజేపీ ఎలాగూ తనకు మిత్రపక్షమే.
సో.ఇక మిగిలింది పవన్ పార్టీ.ఇది చెలిమి చేస్తుందా? లేదా అనే విషయంలో ఇప్పటికైతే క్లారిటీ లేదు.అంతేకాకుండా.
ప్రత్యేక హోదా విషయం పవన్‌కి, బాబుకి మధ్య బెడిసి కొట్టింది.దీంతో పవన్ ఒంటరిగా 2019లో ఎన్నికల్లో పోటీ చేస్తే.
పర్యవసానం ఎలా ఉండబోతోంది? ఆయన ఏ రేంజ్‌లో టీడీపీకి పోటీ అవుతాడు? వంటి అంశాలు బాబును కలవరపెడుతున్నాయి.ఈ క్రమంలోనే పవన్‌పై ప్రజాభిప్రాయ సేకరణ జరిపిస్తున్నారు బాబు.
అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ సర్వేలో.2014 ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేశారు? జనసేనాని పవన్‌ను సమర్థుడైన రాజకీయ నేతగా మీరు భావిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని అనుకుంటున్నారా? జనసేన ఏ పార్టీతో కలిసి పోటీ చేయాలని మీరు భావిస్తున్నారు? జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మీరు ఓటేస్తారా? జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏ పార్టీ నష్టపోతుందని అనుకుంటున్నారు? సమర్థవంతమైన అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేసేంత శక్తి జనసేనకు ఉందా? వంటి పలు అంశాలపై లోతైన ప్రశ్నలే సంధిస్తున్నారు.మరి జననాడి ఎలా ఉందో తెలియాలంటే .కొంత టైం వెయిట్ చేయాల్సిందే.