బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్ సమయంలో సోమవారం నుండి శుక్రవారం వరకు పరమ బోరింగ్‌గా అనిపించేది.శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ వస్తే ఆ రెండు రోజులు మాత్రం దుమ్ము రేపే విధంగా టీఆర్పీ రేటింగ్ వచ్చేది.
సీజన్ మొత్తం కూడా ఎన్టీఆర్ వల్ల నడిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక రెండవ సీజన్ విషయానికి వస్తే పార్టిసిపెంట్స్ విషయంలో గొడవల కారణంగా క్రేజ్ దక్కింది.
ఎన్టీఆర్‌తో పోల్చితే నాని అంతగా ఆకట్టుకోలేక పోయాడనే టాక్ వచ్చింది.
మొదటి సీజన్‌కు ఎన్టీఆర్, రెండవ సీజన్‌కు నాని హోస్టింగ్ చేయగా మూడవ సీజన్‌కు నాగార్జున హోస్టింగ్ చేస్తున్న విషయం తెల్సిందే.నాగార్జున సీజన్ 3 ప్రారంభం రోజున వచ్చి పార్టిసిపెంట్స్‌ను పరిచయం చేసి వెళ్లి పోయాడు.నేడు వీకెండ్‌లో నాగ్ హౌస్‌మెంట్స్‌తో మాట్లాడబోతున్నారు.
గత వారం రోజులుగా జరిగిన రచ్చపై చర్చ ఉంటుంది.తప్పు చేసిన వారిని ఎన్టీఆర్ అయితే నువ్వు తప్పు చేశావు అందుకు సాక్ష్యం ఉంది, నీ ప్రవర్తన సరిగా లేదు అంటూ బాహాటంగా చెప్పేవాడు.
కాని నాని మాత్రం అలా ఎక్కువ శాతం చెప్పలేక పోయాడు.
నేడు నాగార్జున నుండి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పలు గొడవలు, చిన్న చిన్న విషయాలకు రెచ్చి పోవడాలు చాలానే జరిగాయి.ఆడవారి గురించి కొందరు తప్పుగా మాట్లాడటం, కాస్త అతి రియాక్షన్‌లు ఇవ్వడం వంటివి చాలా జరిగాయి.
దాంతో నాగార్జున వాటిపై సీరియస్ అవుతాడా లేదా అనేది చూడాలి.నాగార్జున లైట్‌గా ఉంటే మాత్రం విమర్శలు వచ్చే అవకాశం ఉంది.విమర్వలు రాకుండా తప్పును ఎత్తి చూపి హౌస్‌మెంట్స్‌కు బుద్ది ఎలా నాగార్జున చెప్తాడు అనేది ఆయన సత్తా ఆధారంగా వెళ్లడి కానుంది.