నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా "ముత్తయ్య" టీజర్ విడుదల

జీవితంలో ఒక్క సినిమాలోనైనా నటించాలని కోరుకునే వ్యక్తి ముత్తయ్య.అతని కోరిక నెరవేరిందా లేదా అనే ఆసక్తిని కలిగిస్తూ సాగింది “ముత్తయ్య” సినిమా టీజర్.ఈ టీజర్ ను నేచురల్ స్టార్ నాని శనివారం విడుదల చేశారు.24 ఏళ్ల వయసులో నాకు “అష్టా చమ్మా” సినిమాలో అవకాశం రాకుంటే 70 ఏళ్లకు నేనూ ముత్తయ్యలాగే అయ్యేవాడిని.టీజర్ మనసుకు హత్తుకుంది అంటూ స్పందించారు.చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ అంటూ విశెస్ చెప్పారు.కె సుధాకర్ రెడ్డి, అరుణ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు బ్యానర్స్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సమర్పణలో వ్రిందా ప్రసాద్ నిర్మించారు.భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు.

 muttiah Teaser Released By The Natural Star Nani , Muttiah , Teaser , Bhaskar M-TeluguStop.com

యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించిందీ చిత్రం.మే 9న లండన్ లోని రిచ్ మిక్స్ లో ప్రీమియర్ కానుంది.

టీజర్ విడుదల సందర్భంగా చిత్ర సమర్పకులు కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి మాట్లాడుతూ…మా సినిమా టీజర్ ను నాని విడుదల చేయడం సంతోషంగా ఉంది.మా సంస్థ తరపున ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాం.

ముత్తయ్య ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచే సినిమా అవుతుంది.అన్నారు.

నిర్మాత వ్రిందా ప్రసాద్ మాట్లాడుతూ…మా సినిమా టీజర్ విడుదల చేసినందుకు నానికి థాంక్స్.జీవితంలో ఏదైనా సాధించాలని కలగనే ప్రతి ఒక్కరూ ముత్తయ్యలో కనిపిస్తారు.

అలాంటి వారి భావోద్వేగాలను దర్శకుడు భాస్కర్ మౌర్య ఆకట్టుకునేలా తెరకెక్కించాడు.మా సినిమా యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైనందుకు గర్వంగా ఉంది.

ప్రెజెంటర్స్ హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థకు కృతజ్ఞతలు.అన్నారు.

దర్శకుడు భాస్కర్ మార్య మాట్లాడుతూ…తమ కలలను సాకారం చేసుకోవాలని ప్రయత్నించే ఎంతోమంది వ్యక్తుల ఆరాటానికి ప్రతిబింబం ఈ సినిమా.అలాంటి వాళ్ల నుంచి స్ఫూర్తి పొందే ఈ కథ రాసుకున్నాను.

నా కథను అందంగా తెరకెక్కించేందుకు సహకరించిన టీమ్ అందరికీ థాంక్స్.అన్నారు.

టి సాయి లీల, జయవర్థన్ సాగర్, కిరణ్ కుమార్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – దివాకర్ మణి, సంగీతం – కార్తీక్ రోడ్రిగ్వజ్, ఎడిటర్ – సాయి మురళి, సహ నిర్మాత – దివాకర్ మణి, నిర్మాత – వ్రిందా ప్రసాద్, సమర్పణ – కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి, పీఆర్వో – జీఎస్కే మీడియా, రచన దర్శకత్వం – భాస్కర్ మౌర్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube