తెలంగాణ‌లో బీజేపీ కొత్త స్కెచ్.. అమిత్ షా వార‌సుడిగా అత‌డికి బాధ్య‌త‌లు..!!

తెలంగాణ‌లో ఒక్క ఎమ్మెల్యేతో మొద‌లై.ప్ర‌స్తుతం అధికారం చేజిక్కించుకునే దిశ‌గా బీజేపీ ప‌రిగెడ‌తోంది.

 Bjp New Sketch In Telangana Suneel Bansal As Amit Shah Successor Details, Ameth-TeluguStop.com

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో పాగా వేయాల‌ని ఢిల్లీ పెద్ద‌లు ఫోక‌స్ చేస్తున్నారు.అధికార పార్టీ వ్య‌తిరేక‌త.

కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీన‌త‌ల‌ను వాడుకుని తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌ని చూస్తోంది.ఈ నేప‌థ్యంలోనే జోరు పెంచారు.

ఇటీవ‌ల జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు కూడా హైద‌రాబాద్ న‌గ‌రంలో పెట్టి నేత‌లంతా క్యూ క‌ట్టారు.ఇక రాష్ట్ర బీజేపీలో కూడా చేరిక‌లు పెరుగుతున్నాయి.

దుబ్బాక‌, హుజ‌రాబాద్ గెలుపుతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.దీంతో ఇప్పుడు మునుగోడులో కూడా జెండా ఎగ‌రేయాల‌ని చూస్తోంది.

ఇక కేంద్రం నుంచి అందుతున్న మ‌ద్ద‌తు ఇక్క‌డి పార్టీ నేత‌ల‌కు అద‌న‌పు బ‌లంగా మారింది.త్రిపుర‌లో ఎలాంటి వ్యూహాన్ని అవ‌లంబించి అక్క‌డి క‌మ్యూనిస్టుల కోట‌ను కూల్చేశారో అదే వ్యూహాన్ని ఇక్క‌డ అవ‌లంభించి రాష్ట్రంలో క‌మ‌లం జెండాను రెప‌రెప‌లాడించే దిశ‌గా అధిష్టానం అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగానే రాష్ట్రంలో పార్టీ సంస్థాగ‌త వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించ‌డానికి రాజ‌స్థాన్ కు చెందిన సునీల్ బ‌న్సాల్‌కు అప్ప‌గించిన విషయం తెలిసిందే.ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి త‌రుణ్ ఛుగ్‌కు కేవ‌లం రాజ‌కీయ వ్య‌వ‌హారాల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప‌రిమితం చేశారు.

అమిత్ షాకు రైట్ హ్యాండ్‌గా ఉండే సునీల్.

Telugu Ameth Shah, Bandi Sanjay, Munugodu, Sunil Bansal, Tarun Chugh, Telangana,

అమిత్ షాకు రైట్ హ్యాండ్‌గా ఉండే సునీల్ రాక‌తో తెలంగాణ బీజేపీతో నూత‌నోత్తేజం వెల్లివిరుస్తుంద‌ని భావిస్తున్నారు.వాస్త‌వానికి క్షేత్ర‌స్థాయిలో బీజేపీకి బ‌లం లేదు.టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు అదే ప్ర‌ధాన బ‌లం.

కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉన్న బీజేపీ మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లోపేతం కావ‌డంపై దృష్టిసారించింది.వీటిని దృష్టిలో ఉంచుకొనే సునీల్‌కు బాధ్యతలు అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది.2017లో జ‌రిగిన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న‌ విజయం సాధించడంలో సునీల్ బన్సాల్ ది కీలక పాత్ర.2022లో యూపీలో యోగి ఆదిత్యనాథ్ తిరిగి రెండోసారి అధికారంలోకి రావడంలోను కీల‌కంగా ప‌నిచేశారు.బూత్ స్థాయి నుంచి పార్టీని బ‌లోపేతం చేసి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌డంలో సునీల్ అత్యంత నైపుణ్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తారు.ఆయ‌న దృష్టి మొత్తం ఈ అంశంపైనే ఉంటుంది.యోగి రెండోసారి ముఖ్యమంత్రి కావడంలో ముఖ్యమైన విషయం.వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మార్చడం.

ఈ అంశం పార్టీ విజయానికి కీలకంగా మారింది.దీంతో రెండో సారి యోగీ గెలుపు త‌థ్యం అయింది.

Telugu Ameth Shah, Bandi Sanjay, Munugodu, Sunil Bansal, Tarun Chugh, Telangana,

క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించి…

అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో ఒక్కోసారి సునీల్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఖరారు చేస్తారు.ఆయన అంచనాలకు అనుగుణంగా లేకపోతే వారిని తిరస్కరిస్తారు.తెలంగాణలో కూడా బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టిపెట్టిన బీజేపీ అందుకనుగుణంగానే సునీల్ కు బీజేపీ తెలంగాణ సంస్థాగత వ్యవహారాలను అప్పగించిన‌ట్లు తెలుస్తోంది.తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్ క్షేత్రస్థాయిలో చేస్తే అధికారాన్ని ద‌క్కించుకోగ‌ల‌న‌మ‌ని పార్టీ భావిస్తోంది.

ఇక మునుగోడుతో మొద‌లు పెడితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ మేర‌కు విజ‌యం సాధిస్తారో వేచి చూడాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube