క్యూలో వున్నవారికి ఛాయ్‌ ని సర్వ్ చేస్తున్న శ్రీలంక మాజీ క్రికెటర్‌?

నేడు శ్రీలంక ఎలాంటి దౌర్భాగ్యమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో అందరికీ తెలిసిందే.తీవ్రమైన ఆర్థిక మాంద్యంతో లంక అతలాకుతలం అయిపోతుంది.

 Srilanka, Players, Sports Update, Latest News,tea, Serving , Roshan Mahanama-TeluguStop.com

ఇటీవల జరిగిన పలు రాజకీయ హింసాత్మక అల్లరుల మధ్యలో అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది.ప్రస్తుతం ఈ కొత్త ప్రభుత్వం ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పలురకాల ప్లాన్స్ వేస్తోంది.

ఇక్కడ ఇంకో దురదృష్టకర వార్త ఏమంటే, విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గిపోవడంతో వస్తువులను దిగుమతి చేసుకోవడం కూడా ఒకింత కష్టంగా మారింది.దాంతో ఇంధన సంక్షోభాన్ని సైతం తీవ్రస్థాయిలో ఎదుర్కొంటుంది.

ఈ క్రమంలో అక్కడ కొత్త ప్రభుత్వం అనవసర ప్రయాణాలను తగ్గించుకోమని ప్రజలకు సూచిస్తోంది.అయినా ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోలేరు కదా.అందువలన అక్కడ పెట్రోల్‌ బంక్‌ల వద్ద జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు.ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఓ అద్భుతం జరిగింది.

శ్రీలంక మాజీ క్రికెటర్‌ రోషన్‌ మహానామా అందరికీ తెలిసే ఉంటుంది.ఆటగాడు పెట్రోల్‌ బంక్‌ల వద్ద నుంచొని ఉన్న ప్రజలకు టీలు, స్నాక్స్‌ సర్వ్‌ చేసి, ఉదరాన్ని చాటుకున్నాడు.

దాంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.క్యూలో అంతసేపు నుల్చుని ఉండటంతో వారికి బాగా ఆకలిగా ఉంటుంది.అందువల్ల మనం వారికి సాయం చేయాల్సిన అవసరం వుంది.

అందుకే ఇలా చేశానని చెప్పుకొచ్చాడు.ప్రస్తుత పరిస్థితులలో ప్రతిఒక్కరిని తమ కోసం కాకపోయినా తన పక్కవారి కోసమైన ఏమైన ఆహార పదార్థాలు తమతోపాటు తీసుకెళ్లమని చెబుతున్నాడు.

ఎవరికైన బాగోకపోతే అత్యవసర నెంబర్‌ 1990కి కాల్‌ చేయమని చెబుతున్నాడు.ఈ సందర్భంగా ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఒకరికొకరు సాయంగా ఉంటూ.

మద్దతు ఇచ్చుకోవాలని పిలుపునిచ్చారు మన మాజీ క్రికెటర్‌ రోషన్‌ మహానామా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube