టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం.ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది.
వేణు ఉడుగుల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా రిలీజ్ చేయకుండా ఆపారు.నక్సల్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూసారు.
వారి ఎదురు చూపులకు ఫలితంగా ఈ సినిమా జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు.
సాయి పల్లవి రానా జోడీగా నటించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.ఈ సినిమా మొదటిరోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
అయితే పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు.ఈ సినిమా 12.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది.కానీ ఇప్పటి వరకు 3 కోట్లు కూడా దాటలేక పోయింది.
దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే అంటున్నారు.అయితే ఈ సినిమా విషయంలో ఒకరి మాట విని ఉంటే ఈ భారీ నష్టం తప్పి ఉండేది అని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేద్దాం అని అనుకున్నారట.ఈయన కరోనా సమయంలో నిర్మించిన నారప్ప, దృశ్యం సినిమాలో ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యాయి.ఈయన తెలివిగా ఈ సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేసి లాభాలు అందుకున్నారు.అయితే విరాటపర్వం సినిమా మాత్రం సాయి పల్లవి ఉందని ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉందని కలెక్షన్స్ కు బాగా రాబడుతుంది అని భావించారట.

నిర్మాత చెరుకూరి సుధాకర్ కూడా థియేట్రికల్ రిలీజ్ కు వెళ్లాలని అనుకున్నారట.దాంతో సురేష్ బాబు కూడా సరే అనక తప్పలేదని.అలా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయ్యింది.అయితే పాజిటివ్ టాక్ వచ్చిన ఈ సినిమాను మాత్రం థియేటర్స్ లో చూసే ప్రేక్షకులు తక్కువ అయ్యారు.ఓటిటిలో రిలీజ్ అయినా తర్వాత చూద్దాం అని చాలా మంది ఎదురు చూస్తున్నారు.సురేష్ బాబు మాట విని ఓటిటిలో రిలీజ్ చేస్తే నష్టాలు చూసే అవకాశం ఉండేది కాదు.







