కాకినాడ జిల్లా సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి విద్యార్థులు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.తమ బిడ్డలను కాలేజీలోకి అనుమతించాలని కోరుతున్నారు.
తొమ్మిది రోజులక్రితం ఎనిమిది మంది విద్యార్థులను కాలేజ్ యాజమాన్యం సస్పెండ్ చేసింది.తరగతి గదిలో ఓ పాటకు అసభ్యకర స్టెప్పులతో విద్యార్థులు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
దీనిపై స్పందించిన కళాశాల యాజమాన్యం విద్యార్థులపై చర్యలు తీసుకుంది.ఈ నేపథ్యంలో తమ పిల్లలు చేసింది తప్పేనని, క్షమించి వారిని తిరిగి కాలేజీలో అనుమతించాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
గతంతో సస్పెండ్ చేయడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు చేసుకున్నాడని పేరెంట్స్ గుర్తు చేస్తున్నారు.తాము కూడా తీవ్ర మనోవేధనకు గురవుతున్నామని వాపోతున్నారు.